• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లిల్లీ పాత్రను శ్రీలీల...

లిల్లీ పాత్రను శ్రీలీల చేసుంటే..?

| నిజానికి 'డీజే టిల్లు 2' సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ అనుపమ కంటే ముందు శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2024-04-02 17:26 GMT

'డీజే టిల్లు' సీక్వెల్ గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. మార్చి 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే రూ. 78 కోట్లు వసూలు చేసి, వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన హీరో హీరోయిన్లు సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లకు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి సందడే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వీరితో పాటుగా యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది.

నిజానికి 'డీజే టిల్లు 2' సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ అనుపమ కంటే ముందు శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన అనంతరం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయినప్పటికీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన 'గుంటూరు కారం', 'ఆదికేశవ' సినిమాల్లో భాగం అవ్వడంతో.. డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకనే టిల్లు గాని సినిమా నుంచి శ్రీలీల బయటకు వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. బోల్డ్ సీన్స్ కారణంగానే ఆమె సినిమా నుంచి తప్పుకుందనే టాక్ కూడా వినిపించింది.

కారణం ఏదైనా 'టిల్లు స్క్వేర్' ప్రాజెక్ట్ లోకి శ్రీలీల స్థానంలో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డ్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ తోనే క్లారిటీ వచ్చేసింది. విడుదలకు ముందు ఆమెపై దారుణమైన ట్రోల్స్‌ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న స్పెషల్ ఆఫీసర్ రోల్ ను అద్భుతంగా పోషించింది. లిల్లీగా తన బోల్డ్ సన్నివేశాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సిద్ధూతో లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

'టిల్లు స్క్వేర్' సినిమా మొదటి భాగాన్ని మించి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో.. శ్రీలీల గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అదే సమయంలో శ్రీలీలా ఆ పాత్రకు న్యాయం చేయగలిగేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ ఆమె లిల్లీ లాంటి నెగెటివ్, బోల్డ్ క్యారక్టర్ లో నటించుంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండేది? సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో? అని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

‘పెళ్ళి సంద‌D’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. తన అందంతో, డ్యాన్స్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించింది కానీ, పెద్దగా ఎక్స్ పోజింగ్ చెయ్యలేదు. రొమాంటిక్ సీన్స్ లో నటించింది కూడా తక్కువే. కానీ ఇక్కడ 'టిల్లు స్క్వేర్'లో లిల్లీ పాత్ర పూర్తిగా భిన్నమైనది. బోల్డ్‌ గా కనిపించడమే కాదు, ఎలాంటి మొహమాటం లేకుండా గాఢమైన చుంబన దృశ్యాల్లో నటించాలి. అలాంటి పాత్రను అనుపమ ఛాలెంజింగ్ గా తీసుకుని నటించి మెప్పించింది. ఆడియన్స్ కూడా ఆమెను ఆ క్యారక్టర్ లో యాక్సెప్ట్ చేసారు. అదే శ్రీలీల నటించి ఉంటే ఇలాంటి రెస్పాన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే అభిమానులు అలాంటి పాత్రలో ఆమెను జీర్ణించుకోలేరు.

రవితేజతో 'ధమాకా'.. బాలకృష్ణ కుమార్తెగా 'భగవంత్ కేసరి'.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శ్రీలీల. ఒకవేళ శ్రీలీల లిల్లీ పాత్ర చేసి ఉంటే, ఆమె కెరీర్ ఇలా ఉంటుందో లేదో చెప్పలేం. అలాంటి రోల్స్ చేయడానికి ఆమెకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. 'టిల్లూ స్క్వేర్' నుండి తప్పుకోవడం సరైన నిర్ణయమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక బ్లాక్ బస్టర్ మిస్ అయినా, రానున్న రోజుల్లో అంతకంటే పెద్ద సక్సెస్ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ పరీక్షలతో బిజీగా ఉన్న శ్రీలీల.. పవన్ కళ్యాణ్ తో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తోంది. ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ మూవీ తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Tags:    
  • Sreeleela 
  • Anupama 
  • Tillusquare 
  • Djtillusequel 
  • Siddhujonnalagadda 
  • Tollywood 
  • Bhagavanthkesari 
  • Gunturkaaram 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS