ఎప్పుడొచ్చిందో? వెళ్లిందో! కూడా తెలియలేదే!
టాలీవుడ్ కి శ్రీలీల ఓ మెరుపులా వచ్చింది. మరి ఆ మెరుపు ఎంత కాలం కొనసాగించిందంటే? `ధమాకా` తర్వాత రెండేళ్ల పాటు బాగానే మురిపించింది.;
టాలీవుడ్ కి శ్రీలీల ఓ మెరుపులా వచ్చింది. మరి ఆ మెరుపు ఎంత కాలం కొనసాగించిందంటే? `ధమాకా` తర్వాత రెండేళ్ల పాటు బాగానే మురిపించింది. హీరోయిన్ అనే ఇమేజ్ కంటే? అమ్మడు తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ తో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంది. అదనంగా అమ్మడు మంచి డాన్సర్ కావడం పరిశ్రమలో కలిసొచ్చింది. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా? అందం, అభినయం, డాన్సింగ్ స్కిల్స్ వంటివి అవకాశాలు బాగానే కల్పించాయి. ఆ క్రేజ్ తోనే పాన్ ఇండియా చిత్రం `పుష్ప 2` లో కిసిక్ బ్యూటీగానూ అలరించింది.
అంచనాలు తప్పిన చిత్రాలవి:
కానీ హీరోయిన్ గా మాత్రం రావాల్సినంత గుర్తింపు ఇంత వరకూ రాలేదు? అన్నది కాదనలేని నిజం. హీరోయిన్ సహా స్టార్ హీరోల చిత్రాల్లో సెకెండ్ లీడ్స్, కీలక పాత్రల్లోనూ కనిపించింది. 2025 లో మాత్రం కేవలం హీరోయిన్ గానే నటించింది. నితిన్, రవితేజ సరసన ఆడిపాడింది. మరో యంగ్ హీరో చిత్రంలోనూ నటించింది. కానీ ఈ సినిమాల వైఫల్యంతో? ఎప్పుడొచ్చిందో? వెళ్లిందో కూడా అర్దం కాని సన్నివేశం ప్రేక్షకులది. నితిన్ కి జోడీగా `రాబిన్ హుడ్` లో నటించింది. ఈ సినిమా ఏడాది ఆరంభం మార్చిలో రిలీజ్ అయింది.
సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వలే:
కానీ ఆ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. అటుపై `జూనియర్` అనే చిత్రంలో నటించింది. ఇందులో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు హీరో కావడంతో? పారితోషికం పరంగా భారీగానే ముట్టింది. జులైలో రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. అనంతరం మాస్ రాజా రవితేజ కు జోడీగా నటించిన `మాస్ జాతర` లో కనిపించింది. ఈ సినిమాతోనైనా మెరుస్తుందనుకున్నారు. `ధమాకా` లాంటి సక్సస్ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని భావించింది. కానీ అక్టోబర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా కూడా ఫెయిలైంది.
వాటికి ముగింపు ఎప్పుడో?
ఇలా మూడు వైఫల్యాలతో అమ్మడు ప్రేక్షకుల ముందుకు రావడంతో? అభిమానులకు రీచ్ అవ్వలేకపోయింది. అలాగే వచ్చిన కొన్ని అవకాశాలను కూడా శ్రీలీల వదులుకున్న వైనం నెగివిటీని తెచ్చి పెట్టింది. తెలుగు అవకాశాలు కాదని బాలీవుడ్ ఛాన్సులకు ఎస్ చెప్పడం తో ప్రతి కూల సన్నివేశాన్ని చూసింది. మరి కొత్త ఏడాదైనా ఈ విమర్శలకు చెక్ పెడుతుందా? అన్నది చూడాలి. చేతిలో ఉన్నది ఒకే ఒక్క తెలుగు సినిమా. అదే `ఉస్తాద్ భగత్ సింగ్`. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. ఇందులో పవన్ కు జోడీగా శ్రీలీలతో పాటు మరికొంత మంది భామలు కూడా నటిస్తున్నారు. మరి వాళ్లతో పెర్పార్మెన్స్ పరంగా ఎలాంటి పోటీనిస్తుంది? అన్నది చూడాలి. ఇప్పటికే శ్రీలీల బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఇక అక్కడే కంటున్యూ అవుతుందనే చర్చ జరుగుతోంది. వాటికి కొత్త ఛాన్సులతో పుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.