పాన్ ఇండియా మార్కెట్ లో వెనుక‌బ‌డిన సంచ‌ల‌నాలు!

దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి పాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందుకుంటున్న దర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Update: 2026-07-10 13:30 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి పాన్ ఇండియా స్థాయిలో విజయాలు అందుకుంటున్న దర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టికర్తలుగా ట్రెండ్ సెట్టర్లుగా వెలుగొందిన మురుగదాస్, శంకర్ , త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకులు ప్రస్తుత పాన్ ఇండియా క్రేజ్ రేసులో వెనుకబడటం అభిమానులను కలవరపెడుతోంది. వీరి తర్వాత వచ్చిన యువ దర్శకులు గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథలతో దూసుకుపోతుంటే? ఈ దిగ్గజాలు మాత్రం తమదైన శైలిలో స్థిరపడలేక సతమతమవుతున్నారనే చర్చ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

సమాజంలోని సమస్యలను, వాణిజ్య విలువలతో కలిపి అద్భుతమైన సినిమాలు తీయడంలో వీరికి సాటి ఎవరూ లేరు. కానీ పాన్ ఇండియా మార్కెట్ మారుతున్న కొద్దీ ప్రేక్షకుడి ఆకాంక్షలు కూడా మారుతున్నాయి. శంకర్ తాజా చిత్రాలతో తనదైన విజువల్ వండర్ మ్యాజిక్‌ను పునఃప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. మరోవైపు మురుగదాస్ బలమైన కథనంతో మళ్లీ ఫామ్‌లోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ఇద్ద‌రి నుండి ప్రేక్షకులు ఆశించే ఇంటెన్సిటీని పాన్ ఇండియా స్థాయిలో ఎలా చూపించాలనే దానిపై రు తీవ్రమైన మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిలో త్రివిక్రమ్ పరిస్థితి కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఎన్టీఆర్‌తో మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో గురూజీ తన శైలిని ఎలా మార్చుకోబోతున్నారు. పాన్ ఇండియా ప్రేక్షకులకు త్రివిక్రమ్ మార్క్ కంటెంట్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరమైన అంశం. ఒకవేళ ఈ సినిమా గనుక భారీ విజయం సాధిస్తే త్రివిక్రమ్ మళ్లీ టాప్ గేర్‌లో దూసుకెళ్లడం ఖాయం.

అయితే ఈ దిగ్గజాలు వెనుకబడటానికి ప్రధాన కారణం కంటెంట్ కన్ఫ్యూజన్ అనే విమ‌ర్శ‌లున్నాయి. లోకల్ ఆడి యన్స్‌ను అలరించిన కథలు పాన్ ఇండియా స్థాయికి వెళ్లేసరికి దాని మ్యాజిక్‌ను కోల్పోతాయి? అనే భ‌యం ఉంది. బహుశా అందుకే జాగ్రత్తగా కొత్త కథల వేటలో సుదీర్ఘ విరామం తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఒకప్పుడు కథల కోసం పరితపించిన దర్శకులు ఇప్పుడు భారీ బడ్జెట్ , భారీ స్టార్‌కాస్ట్ మధ్య కథను ఎలా బ్యాలెన్స్ చేయాలనే సవాలును ఎదుర్కొంటున్నారు.

ప్రతి దర్శకుడి కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలు సహజం. అయితే దిగ్గజాల నుంచి ప్రేక్షకులు ఆశించే ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు చేస్తున్న ప్రతీ చిన్న ఆలస్యం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. రాబోయే కాలంలో ఈ సీనియ‌ర్లు తమ పాత వైభవాన్ని మించి పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తారని ఆశిద్దాం. వారు గనుక తమ మేకింగ్ శైలిని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చుకుంటే మళ్లీ బాక్సాఫీస్ వద్ద వారి హవా మొదలవుతుంది.

దిగ్గజాలు వెనుకబడ్డారు అంటే ఆట ముగిసినట్లు కాదు. కేవలం కొత్త వ్యూహాల కోసం వేచి చూస్తున్నారని అర్థం. మురుగదాస్, శంకర్ , త్రివిక్రమ్ వంటి మేధావులకు సృజనాత్మకత పట్ల ఉన్న నిబద్ధత అందరికీ తెలిసిందే. సరైన కథ దొరికితే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వారి ప్రతాపం ఎలా ఉంటుందో? మళ్లీ చేసే అవ‌కాశం ఉంటుంది. ఆ సమయం కోసం సినీ ప్రపంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News