సూర్య కొడుకు దేవ్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
ప్రముఖ నటుడు సూర్య, హీరోయిన్ జ్యోతిక ల కొడుకు దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ప్రముఖ నటుడు సూర్య, హీరోయిన్ జ్యోతిక ల కొడుకు దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. స్టార్ హీరో కొడుకుగా అందరికీ తెలిసిన దేవ్ ఇప్పటివరకు ప్రజల ముందుకు చాలా అరుదుగా మాత్రమే వచ్చాడు. తాజాగా దేవ్ ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దేవ్ గొంతును తొలిసారిగా వింటున్నామని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించినది. అందులో తనను తాను ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న స్టూడెంట్ గా పరిచయం చేసుకున్నాడు. అలాగే ఆ ఫెలోషిప్‌లో పాల్గొన్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తన అవగాహన ఎలా మారిందో కూడా దేవ్ వివరంగా చెప్పాడు. అందులో చేరకముందే AI గురించి కొంత అవగాహన ఉన్నప్పటికీ, ఈ ఫెలోషిప్ ద్వారా దాని గురించి, భవిష్యత్‌లో దాని పాత్రపై మరింత లోతైన అవగాహన ఏర్పడిందని చెప్పాడు.
దేవ్ మాట్లాడిన తీరు, స్పష్టమైన ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం, ప్రశాంతమైన వ్యక్తీకరణ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య, జ్యోతిక తమ పిల్లలను ఎప్పుడూ మీడియా దృష్టికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అందుకే దేవ్ పబ్లిక్‌గా కనిపించిన ఈ వీడియో ఫ్యాన్స్‌కు మరింత స్పెషల్ గా మారింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, దేవ్ ఇప్పటివరకు గ్లామర్ హడావుడికి దూరంగానే పెరిగాడు. చెన్నైలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ను పూర్తి చేసిన తర్వాత కుటుంబంతో కలిసి ముంబైకి వెళ్లి అక్కడే ఉన్నత విద్యను కొనసాగిస్తున్నాడు దేవ్.
చదువుతో పాటు కరాటేలో కూడా దేవ్ తన టాలెంట్ ను కనబరిచాడు. 2019లో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ ఇష్షిన్‌ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్‌లో విన్నర్‌గా నిలవడంతో పాటు బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు. ఈ ఇయర్ మొదట్లో కరాటే పోటీల్లో విజయం సాధించిన దేవ్‌ను సూర్య అభినందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయి అభిమానులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా, దేవ్ ప్యూచర్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం గతంలో పలుమార్లు వినిపించింది. అయితే అలాంటి వార్తలను సూర్య, జ్యోతిక ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. తమ పిల్లలు ముందుగా చదువుపై పూర్తి దృష్టి పెట్టి, సాధారణ జీవితాన్ని ఆస్వాదించాలని తాము కోరుకుంటున్నామని ఈ స్టార్ దంపతులు పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరలవుతున్న AI ఫెలోషిప్ వీడియో మాత్రం దేవ్ వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అభిమానుల్లో కొత్త డిస్కషన్ కు తెరలేపింది.