'లెనిన్' కోసం అఖిల్ శ్రమ.. థియేటర్ వద్ద ఫ్యాన్ ఇచ్చిన అల్టిమేట్ రివార్డ్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2026-07-10 11:00 GMT

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అఖిల్ కెరీర్‌కు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. ఇలాంటి కష్టకాలంలో అఖిల్‌కు అండగా నిలబడటానికి, ఆయన కష్టాన్ని గుర్తించి బూస్టింగ్ ఇవ్వడానికి ఆ పాత వీరాభిమాని మళ్లీ థియేటర్ ముందుకు వచ్చాడు. సోషల్ మీడియాలో "అయ్యగారే నంబర్ వన్" అంటూ ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ ఫ్యాన్.. థియేటర్ వద్ద చేసిన హడావుడి, చూపించిన ఎమోషనల్ బాండింగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ముచ్చట్లు చూద్దాం..

సోషల్ మీడియా సెన్సేషన్.. మళ్లీ వచ్చాడు:

కొన్నేళ్ల క్రితం అఖిల్ అక్కినేనిపై వీరాభిమానాన్ని చూపిస్తూ ఒక కుర్రాడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. "అయ్యగారు నంబర్ వన్.. ఆయనే రావాలి.. అయ్యగారే కరెక్ట్" అంటూ అతడు వాడిన డైలాగులు సోషల్ మీడియాలో ఎంత పెద్ద మీమ్స్ అయ్యాయో మనకు గుర్తే. ఇక దాదాపు మూడేళ్లకు పైగా అఖిల్ సినిమా ఏదీ రాకపోవడంతో ఆ అభిమాని కూడా పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు అఖిల్ ‘లెనిన్’ మూవీతో థియేటర్లలోకి రావడంతో, ఆ వీరాభిమాని మళ్లీ ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపాడు.

కటౌట్‌కు పూలమాల.. థియేటర్ వద్ద ఫుల్ జోష్:

‘లెనిన్’ సినిమా ఆడుతున్న థియేటర్ వద్దకు చేరుకున్న ఆ అభిమాని, తన ప్రాణపదమైన హీరో అఖిల్ కటౌట్‌కు పెద్ద పూలమాల వేసి సందడి చేశాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన పాత స్టైల్‌లోనే అఖిల్‌కు అదిరిపోయే ఎలివేషన్లు ఇచ్చాడు. ఇక సినిమా కోసం అఖిల్ అన్న, చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని కొనియాడాడు. సినిమా ప్రమోషన్ల కోసం టీమ్ అంతా ఎంత జోష్ తీసుకొచ్చిందో.. అంతకుమించిన క్రేజ్, అటెన్షన్ ఈ వీరాభిమాని రాకతో థియేటర్ వద్ద కనిపించింది.

కష్టకాలంలో తోడు నిలిచే అసలైన సైన్యం:

Qఅఖిల్ కెరీర్‌లో ‘లెనిన్’ ఎంత మస్ట్-విన్ సినిమానో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్ కోసం అఖిల్ ఎంతలా తపించాడో, ఎంత కష్టపడ్డాడో అందరూ చూశారు. గతంలో అఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ అభిమాని గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇక ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని, తన హీరోకు కెరీర్‌లోనే అత్యంత కీలకమైన సమయంలో ధైర్యంగా, తోడుగా నిలబడటానికి ఇలాంటి అభిమానులు రావటం చూస్తుంటాం. ఒక హీరో కష్టాన్ని గుర్తించి, సపోర్ట్‌గా నిలిచే ఇలాంటి అభిమానులే స్టార్లకు నిజమైన బలం.

కథానాయకుడిపై కపటం లేని ప్రేమను చూపిస్తూ, కష్టకాలంలోనూ అండగా నిలిచే ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం అఖిల్ అక్కినేని చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ‘లెనిన్’ సినిమా కోసం అఖిల్ పడ్డ శ్రమకు.. ఆ అభిమాని థియేటర్ వద్ద ఇచ్చిన రెస్పాన్స్ ఒక అల్టిమేట్ రివార్డ్‌లా నిలిచింది. మరి ఈ అక్కినేని కుర్రాడికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందిస్తుందో, ఆ "అయ్యగారి" ఫ్యాన్ నమ్మకాన్ని ఎలా నిలబెడుతుందో చూడాలి..

Tags:    

Similar News