రామ్‌తో రిలేషన్‌కు హింట్ ఇచ్చేసిందా?
లెనిన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీకి ఫ్రెండ్, మ్యారీ, డేట్ అనే రాపిడ్ ఫైర్ టాస్క్ ప్రశ్న ఎదురైంది.
టాలీవుడ్‌లో ఈ జెనరేషన్ కు చెందిన హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే పేరు బాగా వినిపిస్తోంది. అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అవకాశాలు అందుకుంటున్న ఈ నటి తాజాగా అఖిల్ అక్కినేని సరసన నటించిన లెనిన్ సినిమా ప్రమోషన్స్‌లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ కు దారితీశాయి. ముఖ్యంగా ఆమె చెప్పిన ఒక్క సమాధానం.. ఇప్పటికే ప్రచారంలో ఉన్న డేటింగ్ రూమర్లకు మరింత ఊపునిచ్చింది.
లెనిన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీకి ఫ్రెండ్, మ్యారీ, డేట్ అనే రాపిడ్ ఫైర్ టాస్క్ ప్రశ్న ఎదురైంది. మీరు వర్క్ చేసిన కో స్టార్స్ లో టాలీవుడ్ హీరోల్లో ఎవరిని ఫ్రెండ్‌గా ఎంచుకుంటారు? ఎవరితో డేటింగ్‌కు వెళ్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్నలకు ఆమె సరదాగా స్పందించారు. ముందు ఫ్రెండ్ గా అఖిల్ ను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పింది. తాను ఇప్పటివరకు కలిసి నటించిన కో స్టార్స్ అందరికీ పెళ్లైపోయిందని, ఇక మిగిలింది ఒక్కరేనని నవ్వుతూ చెప్పింది. అయితే ఇక్కడ భాగ్యశ్రీ రామ్ పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అది రామ్ పోతినేని ను ఉద్దేశించి చేసిన కామెంటే అని ఫ్యాన్స్, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఈ కామెంట్స్ వెనుక మరో కారణం కూడా ఉంది. భాగ్యశ్రీ, రామ్ పోతినేని కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఒకే లొకేషన్‌లో ఉన్నట్లు కనిపించే ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడం, ఒకే సమయాల్లో విదేశీ ట్రిప్‌లకు వెళ్లారనే ఊహాగానాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ రియాక్ట్ అవలేదు.
ఇప్పుడు భాగ్యశ్రీ చేసిన ఈ తాజా కామెంట్స్ తో ఆ పాత రూమర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. కొందరు ఫ్యాన్స్ ఇది కేవలం రాపిడ్ ఫైర్‌లో ఇచ్చిన సరదా సమాధానం మాత్రమే అంటుండగా, మరికొందరు మాత్రం ఆమె ఇన్‌డైరెక్ట్‌గా తన మనసులోని మాట బయటపెట్టిందేమోనని డిస్కస్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వరకు భాగ్యశ్రీ బోర్సే లేదా రామ్ పోతినేని తమ రిలేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని లేదా పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ భాగ్యశ్రీ చేసిన ఈ ఒక్క కామెంట్ మాత్రం మరోసారి ఇద్దరి పేర్లను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. ఫ్యూచర్ లో ఈ రూమర్లపై వారేమైనా రియాక్ట్ అవుతారా? ఇవి కేవలం ఆడియన్స్ ఊహాగానాలుగానే మిగిలిపోతాయా? అన్నది చూడాలి.