ఇక‌పై అలాంటి సినిమాలే చేస్తా

కానీ అవేవీ ఆమె కెరీర్ కు పెద్ద‌గా ప్ల‌స్ అవ‌లేదు. భిన్న పాత్ర‌ల‌లో ఆడియ‌న్స్ ను మెప్పిస్తున్న సోనాక్షి థియేట‌ర్ల‌లో క‌నిపించి మూడేళ్లవుతోంది.;

Update: 2025-07-10 07:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ద‌బాంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి మొద‌టి సినిమాతోనే త‌న యాక్టింగ్, అందంతో అంద‌రినీ ఇంప్రెస్ చేసి మంచి ఫేమ్ ను ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్2 లాంటి సినిమాల్లో న‌ట‌నా ప్రాధాన్యమున్న పాత్ర‌ల‌ను చేశారు.

కానీ అవేవీ ఆమె కెరీర్ కు పెద్ద‌గా ప్ల‌స్ అవ‌లేదు. భిన్న పాత్ర‌ల‌లో ఆడియ‌న్స్ ను మెప్పిస్తున్న సోనాక్షి థియేట‌ర్ల‌లో క‌నిపించి మూడేళ్లవుతోంది. త్వ‌ర‌లోనే నికితా రాయ్ సినిమాతో సోనాక్షి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఖుష్ సిన్హా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ హార్ర‌ర్ సినిమాలో సోనాక్షి టైటిల్ రోల్ లో న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న సోనాక్షి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలను వెల్ల‌డించారు.

త‌న కెరీర్లో అకీరా, నూర్ లాంటి సినిమాలు మైల్ స్టోన్స్ లాంటివ‌ని, ఇప్పుడు నికితా రాయ్ కూడా ఆ కేట‌గిరీకి చెందిన‌దే అని, థియేట‌ర్ కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రినీ ఈ సినిమా ప‌రుగులు పెట్టిస్తుంద‌ని ఆమె అన్నారు. త‌న ఫ్యూచ‌ర్ జ‌ర్నీ గ‌త ఏడెనిమిదేళ్లుగా తాను న‌టించిన పాత్ర‌ల‌కు భిన్నంగా ఉండాల‌నుకుంటున్న‌ట్టు, ఇక‌పై ఎక్కువ‌గా మ‌హిళా పాత్ర‌లు వాటికి సంబంధించిన‌ క‌థ‌ల‌పైనే ఫోక‌స్ చేయాల‌నుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు.

సినిమా మొత్తాన్ని భుజాల‌పై వేసుకుని టైటిల్ రోల్ చేయ‌డమ‌నేది చాలా పెద్ద విష‌య‌మ‌ని, ఇక‌పై త‌న సినిమాల‌కు తానే హీరోగా ఉండాల‌నుకుంటున్న‌ట్టు సోనాక్షి చెప్పారు. ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు తీసుకురావ‌డానికి ఇండ‌స్ట్రీలోని వ్య‌క్తులు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, కానీ పెరుగుతున్న టికెట్ రేట్లు వారిని థియేట‌ర్ల‌కు దూరం చేస్తున్నాయ‌ని, అందుకే ఆడియ‌న్స్ ఎక్కువ‌గా ఓటీటీలో సినిమాలు చూస్తున్నార‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.

ఓటీటీ క‌ల్చ‌ర్ ఎక్కువ‌వుతున్న నేప‌థ్యంలో ఆడియ‌న్స్ ను సినిమాలో, క‌థ‌లో ఇన్వాల్వ్ చేసే క‌థ‌లు చాలా ముఖ్య‌మ‌ని, సినిమా స్టార్టింగ్ నుంచే ఆడియ‌న్స్ దృష్టిని ఆక‌ర్షించే లాంటి సినిమాల్నే చేయాల‌ని, కాస్త లేటైనా ఫ్యూచ‌ర్ లో అలాంటి క‌థ‌ల‌కే తాను ప్రాధాన్య‌మిస్తాన‌ని చెప్తున్నారు సోనాక్షి. అదే ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ‌, పెళ్లి గురించి కూడా మాట్లాడారు సోనాక్షి. గ‌తేడాది జ‌హీర్ ఇక్బాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనాక్షి త‌మ ప‌రిచ‌యం స‌ల్మాన్ ఖాన్ వ‌ల్లే జ‌రిగింద‌ని, ఆయ‌న నిర్వ‌హించిన ఓ పార్టీలోనే జ‌హీర్ ను క‌లిశాన‌ని, తమ పెళ్లి విష‌యంలో సల్మాన్ ఎంతో సంతోషించార‌ని సోనాక్షి చెప్పారు.

Tags:    

Similar News