కుమ్ములాట ఇష్టంలేక ప్రశాంతంగా!
సరి సమానమైన చిత్రాలైతే ఎలాంటి వాయిదాలు లేకుండానే రిలీజ్ అవుతుంటాయి. కానీ సోనాక్షి సిన్హా మాత్రం చిన్న చిన్న రిలీజ్ లకే వెనక్కి తగ్గిన ఘటన వెలుగులోకి వచ్చింది.;
సినిమా రిలీజ్ అన్నది వాయిదా పడటం సహజం. సాధారణంగా వాయిదా అన్నది ఇన్ టైమ్ లో పనులు పూర్తి కాని సందర్భంలో పడుతుంది. బాక్సాఫీస్ వద్ద పోటీని చూసి వాయిదా వేసుకోవడం అన్నది చాలా రేర్ గా జరుగుతుంది. పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడలేక వాయిదా పడుతుంటాయి. పైగా వాటికి థియేటర్ల సమస్య కూడా ఉంటుంది కాబట్టి నిర్మాతలు మంచి తేదిని చూసుకుని కొత్త రిలీజ్ ని ప్రకటిస్తారు.
సరి సమానమైన చిత్రాలైతే ఎలాంటి వాయిదాలు లేకుండానే రిలీజ్ అవుతుంటాయి. కానీ సోనాక్షి సిన్హా మాత్రం చిన్న చిన్న రిలీజ్ లకే వెనక్కి తగ్గిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో 'నికితా రాయ్' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఖుషీ సిన్హా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.
సెన్సార్ ముందుకెళ్లాల్సి ఉంది. ఇదొక హారర్ చిత్రం. ప్రచార చిత్రాలతో బజ్ బాగానే ఉంది. ఈ నెలలో సినిమా విడుదల కావాలి. అయితే సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ నుంచి మరికొన్ని చిత్రాలు రిలీజ్ కు ఉండటంతో వాళ్లతో పోటీ ఎందుకని నికితా రాయ్ ని వాయిదా వేసారు. ఈ విషయాన్ని సోనాక్షి ఇన్ స్టా వేదికగా ప్రకటించింది. చాలా సినిమాలకు రిలీజ్ కు ఉండటంతోనే తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
తన సినిమా ప్రశాంతమైన వాతావరణం లో రిలీజ్ అవ్వాలని.... తామెంతో ప్రత్యేకంగా తీర్చిన నికితారాయ్ ని అంతే ప్రత్యేకంగా రిలీజ్ చేస్తామంది. దీనిలో భాగంగా 18న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. సోనాక్షి సినిమాలు ఇలా పోటీ రేసు నుంచి తప్పుకోవడం అన్నది ఇదే తొలిసారి. గతలో స్టార్ హీరోలకు ధీటుగా సోనాక్షి సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ సోనాక్షి డిమాండ్ ఇప్పుడు తగ్గింది. దీంతో సోనాక్షి కూడా వెనక్కి తగుతోంది.