• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య విశ్వరూపం.....

సూర్య విశ్వరూపం.. గూస్‌బంప్స్‌ తెప్పించేలా 'కంగువ' టీజర్!

| ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-03-19 13:40 GMT

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ''కంగువ''. తమిళ మాస్ డైరెక్టర్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. 'యానిమల్' యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా టీజర్ ను ఆవిష్కరించారు.


ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ అందించే విజువల్ వండర్ గా 'కంగువ' సినిమాని తీర్చిదిద్దుతున్నారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. 'పెరుమాచ్చి' అంటూ సూర్య గర్జించే ఒకే ఒక్క డైలాగ్ తో కట్ చేయబడిన ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో యాక్షన్ సీన్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఒక హలీవుడ్ సినిమాని తలపించే విధంగా ఉన్నాయి. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.

'కంగువ' అంటే తమిళంలో అగ్నిలా దేన్నైనా దహించే శక్తి కలిగినవాడు, అత్యంత పరాక్రమవంతుడు అనే అర్థాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు టీజర్ లో సూర్యను ఒక రూత్ లెస్ వారియర్ అవతార్ లో ప్రెజెంట్ చేశారు. కండలు తిరిగిన బాడీ, ఒంటి నిండా పచ్చబొట్లు, జడలు అల్లుకున్న పొడవాటి జుట్టుతో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త మేకోవర్ తో కనిపించి ఆశ్చర్యపరిచారు. దీంట్లో ఆయనకు ఒక పెద్ద పులికి మధ్య ఫైట్ సీన్, హార్స్ రైడింగ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య పడిన కష్టమంతా స్క్రీన్ మీద కనిపిస్తోంది.

మరోవైపు బాబీ డియోల్‌ విలన్ పాత్రలో ఇంటన్స్‌ లుక్‌లో కనిపించారు. ఆయన క్యారెక్టర్ ను ఎంతో పవర్ ఫుల్ గా, హీరో పాత్రకు ధీటుగా ఉండేలా డిజైన్ చేసినట్లు 'కంగువ' టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీరిద్దరూ రెండు వేర్వేరు తెగలకు నాయకత్వం వహిస్తుండగా.. ఇద్దరి మధ్య హోరాహోరా పోరు జరగబోతోందని టీజర్ చివర్లో హింట్ ఇచ్చారు. ఒకరికొకరు ఎదురుపడి కయ్యానికి కాలు దువ్వుతున్న షాట్ హైలైట్ గా నిలిచింది. ఇది 'బాహుబలి 2' లో ప్రభాస్ - రానాల ఫైట్ సీన్ ను గుర్తు చేస్తుంది. అడవుల్లో, సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉన్న సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో సూర్య, బాబీ డియోల్ తప్ప, హీరోయిన్ తో సహా ఇతర ప్రధాన పాత్రదారులెవరికీ ఈ టీజర్ లో చోటు కల్పించలేదు.

ఓవరాల్ గా వరల్డ్ క్లాస్ మేకింగ్, గ్రాండియర్ విజువల్స్, అధ్బుతమైన పర్ఫార్మెన్స్ తో వచ్చిన 'కంగువ' టీజర్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అపోకలిప్స్,1000 బీసీ లాంటి హలీవుడ్ సినిమాల రేంజ్ లో తెరకెక్కించిన విజువల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. నిర్మాణ విలువలు గొప్పగాఉన్నాయి. ఇది కచ్చితంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోందని సుమారు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియో చూసి చెప్పొచ్చు.

'కంగువ' చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, పెన్ స్టూడియోస్ సంస్ధలు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇది సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. దీనికి కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివ, ఆది నారాయణ ఈ చిత్రానికి కథ అందించగా.. మదన్ కార్కే డైలాగ్స్ రాశారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నిశాద్ యూసుఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. సుప్రీమ్ సుందర్ యాక్షన్ పార్ట్ డిజైన్ చేసారు.

'కంగువ' సినిమాని భారతీయ భాషల్లోనే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో మొత్తం పది భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీ, ఐమాక్స్ ఫార్మాట్స్ లోనూ ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. త్వరలోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.


Full View


Tags:    
  • Kanguva 
  • SizzleTeaser 
  • Suriya 
  • Bobbydeol 
  • Dishapatani 
  • Madhankarky 
  • Vetri 
  • Siva 
  • Greenstudios 
  • Uvcreations 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS