• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో టిల్లుకి టైమ్...

మరో టిల్లుకి టైమ్ తీసుకోవాల్సిందే..

| అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి టైం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమా చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-04-13 06:52 GMT

సిద్దు జొన్నలగడ్డ టిల్లు సిరీస్ లో భాగంగా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే మూవీ 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో డీసెంట్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది. స్టార్ బాయ్ ఇమేజ్ ని సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో మరింత పెంచుకున్నాడు. అలాగే సాలిడ్ మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.

టిల్లు సిరీస్ కి ముందు కనీసం 10 కోట్ల బడ్జెట్ హీరోగా కూడా లేని సిద్దు జొన్నలగడ్డ టిల్లు సక్సెస్ తో ఏకంగా 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ లెవల్ కి తన మార్కెట్ ని పెంచుకోగలిగాడు. ఎక్కువగా ప్రయోగాలు చేయకుండా ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే కాంటెంపరరీ కథలని ఎంచుకుంటూ నేచురాలిటీకి దగ్గరగా ఉండేలా ప్రెజెంట్ చేస్తూ ఉండటంతో సిద్దు చేస్తోన్న మూవీస్ కి ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతున్నారు.

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ లలో కథలు ఇంచుమించు ఒకే తీరులో ఉన్న కూడా సిద్దు చేసిన టిల్లు క్యారెక్టరైజేషన్, సింగిల్ లైనర్ కామెడీ డైలాగ్స్, అంతకుమించి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అలాగే ఈ జెనరేషన్ లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కారణంగా రెండు సినిమాలు సూపర్ హిట్ కేటగిరీలో చేరాయి. ఇప్పుడు టిల్లు క్యారెక్టర్ ని మరింతగా కొనసాగించాలని నిర్మాత నాగ వంశీ, హీరో సిద్దు డిసైడ్ అయ్యారు. పార్ట్ 3కి టిల్లు క్యూబ్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.

అయితే ఈ మూవీ రిలీజ్ కావడానికి టైం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే మరో సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ రెండు సినిమాల తర్వాత టిల్లు క్యూబ్ స్టార్ట్ కావొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఒకే రకమైన కథలతో సినిమా చేసేటపుడు కచ్చితంగా ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

లేదంటే ఆడియన్స్ కి రొటీన్ గా అనిపించి బోర్ కొట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ కూడా టిల్లు క్యూబ్ కోసం మొదటి, రెండు చిత్రాల తరహాలో లవ్ ఫెయిల్యూర్ కథలని తీసుకోకుండా కొత్త కంటెంట్ ని ట్రై చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. పార్ట్ 3లో లవ్ ఫెయిల్యూర్ అనేది సబ్ ప్లాట్ గా పెట్టుకొని మెయిన్ స్టోరీ అంతా చేంజ్ చేయనున్నారని వినికిడి. మరి టిల్లు క్యూబ్ ఇప్పుడు చిత్ర యూనిట్ ఎప్పుడు అప్డేట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • Siddujonalagadda 
  • Tillucube 
  • Sitharaentertainments 
  • Jack 
  • Bommarillubhaskar 
  • Anupamaparmeswaran 
  • Nehashetty 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS