• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'టిల్లు స్క్వేర్' బర్త్...

'టిల్లు స్క్వేర్' బర్త్ డే గ్లింప్స్.. నెక్ట్స్ లెవెల్ ఫన్ రైడ్!

| సిద్దు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By - Tupaki Desk
Update: 2024-02-07 18:02 GMT

సిద్దు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క సినిమాతో జొన్నలగడ్డ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న టిల్లు స్క్వేర్ మార్చ్ 29 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా నేడు సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ తో వచ్చారు మేకర్స్.

'టిల్లు స్క్వేర్ - సిద్దు బర్త్ డే గ్లింప్స్' పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియోలో సిద్దు మరోసారి తన కామెడీ, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సుమారు నిమిషం 25 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమతో పాటూ మరో నటుడు కారులో వెళ్తుండగా..' హే బ్రో.. మీ బర్త్ డే అంట కదా! హ్యాపీ బర్త్ డే' అంటూ హీరోకి కార్ లో అతను విష్ చేస్తాడు.

దాంతో పక్కనే ఉన్న అనుపమ..' టిల్లు ఐ యాం సో సారీ హ్యాపీ బర్త్డే టూ యు' అంటూ సిద్దుని కిస్ చేస్తుంది. ఆ తర్వాత..' టిల్లు లాస్ట్ ఇయర్ నీ బర్త్ డే కి నువ్వెక్కడున్నావ్?' అని అనుపమ సిద్దుని అడగగానే DJ టిల్లు లోని ఫ్లాష్ బ్యాక్ చూపించారు. దాన్ని సిద్దు చాలా వెరైటీగా అనుపమకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు." మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ మూవీ చూశాం" అని అనడంలో ఏ మూవీ ? అని అనుపమ అడుగుతుంది..

అందుకు సిద్జు బదులిస్తూ.." ఇట్స్ నల్లమల్ల ఫారెస్ట్ నల్లచీర.. ఏ ఫిలిం బై రాధిక.. చాలా పెద్ద డైరెక్టర్ ఆమె బాగా చెప్తుంది కథలు" అంటూ సిద్ధు వివరించిన తీరు ఫుల్ ఫన్ జనరేట్ చేసింది. సిద్ధు చెప్పింది అర్థం కాక అనుపమ..' అట్లాంటి మూవీ కూడా రిలీజ్ అయిందా?' అని అడిగితే..' ఓటీటీటీ, పాన్ మల్కాజిగిరి మూవీ అది' అని అంటాడు.

ఆ తర్వాత దాని స్టోరీ ఏంటని అడిగితే.." అది లవ్, హార్ట్ బ్రేక్, హారర్, హిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్.. ఓవరాల్ గా చాలా పెద్ద కామెడీ మూవీ అది.. నువ్వు ఇంకోసారి అడగకు మళ్ళా.. అంటే ఎప్పుడో చూసిన మూవీ కదా! సరిగ్గా గుర్తు రావడంలేదు.. గుర్తుతెచ్చుకుందామని కూడా లేదు మనకి.. ఏవో పాత జ్ఞాపకాలు" అంటూ సిద్ధు జస్ట్ గ్లింప్స్ మీడియాలోనే తన వెరైటీ డైలాగ్ మోడ్యులేషన్ తో అదరగొట్టేసాడు.

Full View
Tags:    
  • Tillusquare 
  • Siddubirthdayglimpse 
  • Anupamaparameswaran 
  • Sidhujonnalagadda 
  • Djtillusequel 
  • Filmindustry 
  • Tillusquaremovie 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS