• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుకున్నట్లే హీరోయిన్ తో...

అనుకున్నట్లే హీరోయిన్ తో సిద్ధార్థ్ పెళ్లి.. అఫీషియల్!

| తమ పెళ్లి అనంతరం సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ, అదితి తన భర్త సిద్ధార్థ్ పై ప్రేమను చూపించింది.

By - Tupaki Desk
Update: 2024-09-16 07:26 GMT

తమ నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ, తమ ప్రేమను పెళ్లితో అధికారికం చేశారు. సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ పద్దతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో జరిగింది.


తమ పెళ్లి అనంతరం సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ, అదితి తన భర్త సిద్ధార్థ్ పై ప్రేమను చూపించింది. "నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే" అంటూ తన భావాన్ని వ్యక్తం చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ ఈ జంటను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.


అదితి తన పెళ్లికి గోల్డెన్ జారీ వర్క్‌తో రూపొందించిన అద్భుతమైన లెహంగాను ధరించి మరింత అందంగా మెరిసింది. ఆమె వధువు లుక్‌లో, ఎంబ్రాయిడరీతో ప్రత్యేకంగా తయారైన బ్లౌజ్ తో ఆకట్టుకుంది. సిద్ధార్థ్ సాంప్రదాయ వెష్టి, స్టైలిష్ కుర్తాలో రాచరికంగా కనిపించారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు సెలబ్రెటీలు కూడా వారి శుభాకాంక్షలు అందిస్తున్నారు.


చాలా కాలంగా వీరి ప్రేమ వ్యవహారం వార్తల్లో నిలిచినప్పటికీ పెద్దగా వాటిపై రియాక్ట్ కాలేదు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా వివాహం ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. కొన్ని ప్రచారాలు వీరి పెళ్లి రహస్యంగా జరిగిందని పేర్కొన్నప్పటికీ, సిద్ధార్థ్ మరియు అదితి ఆ వార్తలను ఖండిస్తూ, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదితి, తన పెళ్లి ప్రపోజల్ గురించి ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. తన నాన్నమ్మ ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధార్థ్ ప్రపోజ్ చేశాడని, అది తనకు ప్రత్యేకమైన క్షణంగా నిలిచిందని పేర్కొంది. రంగనాథస్వామి ఆలయం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని, అందుకే నిశ్చితార్థం కూడా అక్కడే నిర్వహించామని తెలిపింది.


చివరికి అదే ఆలయంలో పెళ్లి జరిపించుకోవడం తమ కుటుంబ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. ఈ జంట తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడంతో, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇద్దరు కలిసి మహా సముద్రం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం సిద్దార్థ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Tags:    
  • Aditiraohydari 
  • Siddharth 
  • Aditirao 
  • Siddharthaditiwedding 
  • Wanaparthytemple 
  • Adusiddhu 
  • Aditisiddharthwedding 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS