సిద్ధార్థ్.. ఇలాంటి మాటలెందుకు?

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో.. తాను ఎవరో డబ్బులు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదని సిద్ధార్థ్ అన్నారు.;

Update: 2025-06-28 17:46 GMT
సిద్ధార్థ్.. ఇలాంటి మాటలెందుకు?

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి వివిధ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హీరో సిద్ధార్థ్ చెరగని స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. లేడీ ఫ్యాన్స్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బావ వంటి వరుస సినిమాలతో కోలీవుడ్ హీరో.. టాలీవుడ్ హీరోగా మారిపోయారు.

లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాల స్పీడ్ ను తగ్గించేశారు. సెలెక్టెడ్ గా చిత్రాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ కు దూరమై కోలీవుడ్ లో ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో తెలుగు సినీ ప్రేక్షకులను సిద్ధార్థ్ పలకరిస్తున్నారు.

ఇప్పుడు 3 BHK మూవీతో జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ల్యాండ్ మార్క్ 40వ సినిమాతో రానున్న ఆయన.. ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కానీ ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ సమయంలో లాజిక్ లేని ఆన్సర్స్ ఇచ్చారు!

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సమయంలో.. తాను ఎవరో డబ్బులు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదని సిద్ధార్థ్ అన్నారు. ఆ తర్వాత మీకు అలా అనిపిస్తే తానేం చేస్తానని చెప్పారు. దీంతో అందులో లాజిక్ మిస్ అయిందని క్లియర్ గా తెలుస్తోంది. ఎందుకంటే హీరో ఎంత బాగా నటించినా.. నిర్మాతకు డబ్బులు వస్తే మూవీ హిట్ అయినట్టు.

థియేటర్స్ లో మంచి వసూళ్లు రాబడితేనే మూవీ హిట్ అవుతుంది. లేకుంటే అది ఫ్లాపే. అందుకే డబ్బులు రావాలనే అంతా కోరుకోవాలి. కానీ సిద్ధార్థ్ అలా చెప్పడం వాస్తవానికి దూరంగా ఉంది. మరోవైపు, 3 BHK మీడియం రేంజ్ మూవీనే. కానీ మీడియం, హై అనేది మ్యాటర్ కాదని, సినిమాలో విషయం లోతుగా ఉండాలని సిద్ధార్థ్ అన్నారు.

ఆయన చెప్పింది నిజమైనా.. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాన్ని పెద్ద మూవీ అనలేం కదా. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టవచ్చు. కానీ రిలీజ్ కు ముందు అది చిన్న మూవీనే అవుతుంది. కాబట్టి ఆ విషయంలో సిద్ధార్థ్ కామెంట్స్ క్లియర్ గా లేవు. అలా సింపుల్ విషయాల్లో కూడా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు సిద్ధార్థ్. దీంతో ఎందుకు ఇలా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News