శ్వేతా బ‌సుని మ‌ళ్లీ దించుతున్నారా?

ఒక్క ఘ‌ట‌న‌తో శ్వేతా బ‌సు ప్రసాద్ టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి మ‌రే తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు.;

Update: 2025-09-05 14:30 GMT

ఒక్క ఘ‌ట‌న‌తో శ్వేతా బ‌సు ప్రసాద్ టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి మ‌రే తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు. ఆ ఘ‌ట‌న అనంత‌రం బాలీవుడ్ లో కొన్నాళ్లు కొన‌సాగింది. అయితే మూడేళ్ల‌గా అక్క‌డా అవ‌కాశాలు రాలేదు. దీంతో టీవీ సిరీస్ ల‌కు ప‌రిమిత‌మైంది. ప్ర‌స్తుతం వాటితోనే బిజీగా గ‌డుపుతోంది. ఈ మ‌ధ్యలోనే ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఆ బంధం కూడా ఎంతో కాలం నిల‌వ‌లేదు. విడాకుల‌తో వేర‌య్యారు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానుల అటె న్ష‌న్ డ్రా చేస్తూనే ఉంటుంది.

ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్:

హాట్ ఫోటోల‌తో వ‌లపు బాణం విసురుతుంటుంది. తాను సినిమాల ద్వారా ట‌చ్ లో లేక‌పోయినా? మ‌నం క‌లుసుకోవ‌డానికి ఇన్ స్టా అనే ఓ వేదిక ఉందంటూ గుర్తు చేస్తుంటుంది. తెలుగులో అమ్మ‌డికి అప్ప‌ట్లో స‌ప‌రేట్ ప్యాన్ బేస్ కూడా ఉంది. నెట్టింట ఆ ఫాలోయింగ్ ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతుంది. మునుప‌టి కంటే? శ్వేత రూప లావ‌ణ్యంలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. మ‌రింత గ్లామ‌ర్ తో ఎలివేట్ అవుతోంది. అందాల ఎర‌గా ప్యాన్ బేస్ ని అంత‌కంత‌కు పెంచుకుంటుంది. ఇన్ స్టా ద్వారా కూడా ఆదాయం బాగానే స‌మ‌కూరుతుంది.

శ్వేతా బ‌సు కూడా పాజిటివ్ గానే:

స‌రిగ్గా ఇదే ఫాలోయింగ్ ని ఎన్ క్యాష్ చేసుకునే దిశ‌గా టాలీవుడ్ లో ఓ యువ నిర్మాత రంగంలోకి దిగుతున్న‌ట్లు తెలిసింది. ఓ యువ నిర్మాత శ్వేతా బ‌సు ప్ర‌సాద్ లీడ్ రోల్ లో ఓ సినిమా తీసే ఆలోచన‌లో ఉన్న‌ట్లు వినిపిస్తోంది. ఇటీవ‌లే ఆ నిర్మాత ముంబై వెళ్లి శ్వేతా బ‌సు ప్ర‌సాద్ ను క‌లిసాడుట‌. అత‌డితో పాటు వెంట డైరెక్ట‌ర్ కూడా ఉన్నాడు. ఇద్ద‌రు సంయుక్తంగా శ్వేతా బ‌సుకు స్టోరీ నేరేట్ చేసారుట‌. ఆమె కూడా పాజిటివ్ గానే స్పందించిందిట‌. తెలుగు సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తిని తాను కూడా వ్య‌క్తం చేసిందిట‌.

సీరియ‌స్ గా తీసుకుంటేనే:

సినిమాకు సంబంధించి అడ్వాన్స్ మ‌రో భేటీలో ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో సినిమా మొద‌ల‌య్యే వ‌ర‌కూ గానీ క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం శ్వేతా బ‌సు ప్ర‌సాద్ వ‌య‌సు 34 ఏళ్లు. టాలీవుడ్ లో రీ లాంచ్ అయితే గ‌నుక మ‌ళ్లీ అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆమెకంటూ ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి న‌వ‌త‌రం ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు ఆమెతో సినిమాలు చేయ‌డానికి ఆస్కారం ఎక్కువ గానే ఉంది. ఏదిఏమైనా శ్వేతా కూడా టాలీవుడ్ అవకాశాల ప‌ట్ల కాస్తీ సీరియ‌స్ గా ఆలోచన చేస్తే వ‌ర్కౌట్ అవుతుంది.

Tags:    

Similar News