ప్రేమ ప‌క్షుల‌కు తెలీకుండా సీక్రెట్ వీడియో

అయితే శ్ర‌ద్ధా- రాహుల్ మోడీ క‌లిసి ఎక్క‌డికి వెళ్లినా ఆ ఇద్ద‌రినీ కెమెరా క‌ళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జంట‌ను ర‌హ‌స్యంగా వీడియో తీసి షేర్ చేసాడు ఓ ప్ర‌బుద్ధుడు.;

Update: 2025-07-10 00:30 GMT

`సాహో` బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ .. `స్త్రీ 2` ర‌చ‌యిత రాహుల్ మోడీతో ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌న్న పుకార్లు ఉన్నాయి. ఆ ఇద్ద‌రూ క‌లిసి షికార్లు చేయ‌డం, క‌లిసి ఫోటోల‌కు ఫోజులివ్వ‌డం తెలిసిందే. ఇటీవ‌లే శ్ర‌ద్ధా క‌పూర్ త‌మ ఇంటి నుంచి ఓ వీడియోని షేర్ చేయ‌గా, దానిలో రాహుల్ మోడీ కూడా కనిపించాడు. ఈ జంట స్నేహం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తించింది.

అయితే శ్ర‌ద్ధా- రాహుల్ మోడీ క‌లిసి ఎక్క‌డికి వెళ్లినా ఆ ఇద్ద‌రినీ కెమెరా క‌ళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జంట‌ను ర‌హ‌స్యంగా వీడియో తీసి షేర్ చేసాడు ఓ ప్ర‌బుద్ధుడు. అది కూడా విమానంలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇలా చేయ‌డం చ‌ర్చ‌గా మారింది. శ్రద్ధా కపూర్.. ఆమె ప్రియుడు-రచయిత రాహుల్ మోడీ ఇటీవల కలిసి ప్రయాణించారని, విమానం లోపల వారు కలిసి ఉన్నప్పుడు, ఎయిర్‌లైన్ సిబ్బంది ఒకరు రహస్య వీడియోను రికార్డ్ చేశారని ఇండియా ఫోర‌మ్స్ ఇన్‌స్టా పేజీలో పేర్కొంది. విమాన ప్ర‌యాణంలో త‌న ప్రియుడితో శ్ర‌ద్ధా మాట్లాడుతూ అనాలోచితంగా క‌నిపించింది. అయితే ర‌హ‌స్యంగా తీసిన ఈ వీడియోపై స్పందిస్తూ సీనియ‌ర్ నటి రవీనా టాండన్ ఫైర్‌ అయ్యారు. ఇలాంటివి చేయ‌డానికి సిగ్గుండాని, అనుమ‌తి లేకుండా ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని సూచించారు.

ఇది గోప్యతను ఉల్లంఘించడం.. ఇలాంటివి చేయడం కంటే సిబ్బంది ప‌ద్ధ‌తులు నేర్చుకోవాలి. వీడియో లేదా ఫోటో కావాలంటే వారి సమ్మతి తీసుకోవాలి. అయినా విమాన‌ సిబ్బంది నుండి ఇలాంటివి ఊహించ‌లేం.. అని రాసారు. అయితే ఇది ఒక ఫ్యాన్ మూవ్‌మెంట్ అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించ‌గా, ఒక‌రు ``సిగ్గుండాలి.. గోప్యతను ఉల్లంఘించడానికి! అని ఫైర‌య్యారు. ర‌వీనా టాండ‌న్ అభిప్రాయానికి మ‌ద్ధ‌తు ప‌లికారు.

Tags:    

Similar News