కన్నప్పలో ప్రభాస్.. సెకండ్ హాఫ్ వేరే రేంజ్..!

కన్నప్ప సినిమా చూశానని చెప్పిన శివ బాలాజీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుందని అన్నారు.;

Update: 2025-06-25 13:25 GMT

మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన సినిమా కన్నప్ప. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ల పై ఎం. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఇప్పటివరకు రిలీజైన టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజ్ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకోగా ఈ సినిమాలో నటించిన శివ బాలాజీ మీడియాతో ముచ్చటించారు. కన్నప్ప గురించి శివ బాలాజి చెప్పిన విశేషాలేంటో చూద్దాం.

కన్నప్ప గురించి చర్చలు జరుగుతున్న టైం లో తనకు పాత్ర ఇవ్వలేదు. మోహన్ బాబు గారు అడిగి విష్ణుకి చెప్పి శివ బాలాజీ కచ్చితంగా ఉండాలని మహదేవ శాస్త్రి కొడుకు పాత్రకు తనని తీసుకున్నారని అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చానని అన్నారు శివ బాలాజీ.

సినిమాలో తన పాత్ర నిడివి, ప్రాముఖ్యత తక్కువే అయినా ఒక గొప్ప సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇవేమి ఆలోచించలేదని అన్నారు శివ బాలాజీ. న్యూజిలాండ్ లో రెండు నెలలు ఈ సినిమా కోసం ఉన్నాం.. మోహన్ బాబు గారు షూట్ చేసిన అన్నిరోజులు కూడా తాను కూడా షూట్ చేశానని అన్నారు శివ బాలాజీ.

తాను ఎప్పుడు డబ్బుల కోసం సినిమాలు చేయాలని అనుకోనని.. మంచి కథలు వస్తేనే చేస్తున్నా అని అన్నారు. పాత్ర నచ్చకపోతే దర్శక నిర్మాతలకు వెంటనే చెప్పేస్తానని అన్నారు శివ బాలాజీ. తను చేసిన రెక్కీ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సింధూరం అనే సినిమా చేశాను. రెక్కీ 2 ఫీచర్ ఫిల్మ్ గా వస్తుందని చెప్పారు శివ బాలాజీ.

కన్నప్ప సినిమా చూశానని చెప్పిన శివ బాలాజీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుందని అన్నారు. విష్ణు, ప్రభాస్ పాత్రల మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయని అన్నారు. మోహన్ లాల్ ఎంట్రీ కూడా గూస్ బంప్స్ తెస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ చేస్తుందని అన్నారు శివ బాలాజీ.

మోహన్ బాబు గారు ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ వేరు వేరుగా ఉంటారు. విష్ణుతో మా నుంచి పరిచయం ఉంది. మాకు పనిచేస్తున్న టైం లో మా మధ్య మంచి బంధం ఏర్పడింది. అలా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామని అన్నారు. మోహన్ బాబుకి దగ్గరవడం కష్టం ఒక్కసారి దగ్గరైతే ప్రేమతో కట్టిపడేస్తారని అన్నారు శివ బాలాజీ.

ఇక తన కెరీర్ గురించి చెప్పిన శివ బాలాజీ.. మొదట్లోనే 3 ఫ్లాపులు పడ్డాయి. మొదటి హిట్ ఆర్య.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఎత్తుపల్లాలు చూశాను. అందుకే ఇప్పుడు ఏ విషయాన్ని అంతగా పట్టించుకోనని అన్నారు శివ బాలాజీ. ఎవరి నుంచి ఏమి ఆశించనని అన్నారు. ఈ పాత్ర మోహన్ బాబు గారు చేయమని అడిగినప్పుడు ఆలోచించాను.. మరీ సైడ్ నిలబడే రోల్ ఎలా చేయాలని విష్ణుని అడిగా.. నీ ఇష్టం అని అన్నాడు.. ఐతే ఈ సినిమాలో ఆ రోల్ చేయకపోతే చాలా మిస్ అయ్యే వాడినని అన్నారు శివ బాలాజీ.

కన్నప్ప షూటింగ్ లో అక్షయ్ కుమార్ ని చూసి షాక్ అయ్యాను. ఆయన తెరపై కనిపించే ఫస్ట్ సీన్ కు మనం శివుడు అని ఫిక్స్ అవుతామని.. అంతగా పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తారని అన్నారు శివ బాలాజీ. త్వరలో మోహన్ బాబు గారి ప్రొడక్షన్ లో లీడ్ రోల్ లో ఒక సినిమా వస్తుంది. రెక్కీ 2 కూడా వస్తుందని అన్నారు శివ బాలాజీ.

Tags:    

Similar News