నాని ప్లాన్స్ మారాయా? కానీ టార్గెట్ గురి తప్పదా?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతంలో లవర్ బాయ్ గా వరుస ప్రేమ కథలు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు.;

Update: 2026-01-31 16:30 GMT

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతంలో లవర్ బాయ్ గా వరుస ప్రేమ కథలు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. నాని నుంచి హిట్ 3 లాంటి హెవీ వైలెన్స్ సినిమాలను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దసరా వంటి మూవీస్ తో మాస్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు.

అదే సమయంలో నాని ప్లానింగ్ ఎప్పుడూ స్పెషల్ గా ఉంటుంది. ఒక సినిమా పూర్తవుతుండగానే మరో మూవీ ప్రకటించి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సెట్స్‌ కానీ పైకి వెళ్లేలా షెడ్యూల్స్ వేసుకునే హీరోగా ఆయనకు పేరుంది. కానీ ఈసారి మాత్రం అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ మూవీ వల్ల ఆయన ప్లాన్లు తారుమారు అయ్యాయని తెలుస్తోంది.

దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కథ, నేపథ్యం, మేకింగ్ పరంగా కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ చాలా సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్‌ గా రావాలనే లక్ష్యంతో ప్రీ-ప్రొడక్షన్ పనులను డిటైల్‌ గా ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత కూడా దర్శకుడికి పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది.

నాని సైతం ఎలాంటి తొందరపడకుండా, క్వాలిటీ కోసం ఎక్కువ సమయం కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ ఆలస్యమే ఇప్పుడు రిలీజ్ ప్లాన్లపై ప్రభావం చూపింది. మొదట ప్యారడైజ్ ను మార్చిలో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ ప్లాన్ డ్రాప్ అయ్యింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ ఇంకా చిత్రీకరించాల్సి ఉందట.

మిగిలిన షూటింగ్ మే నెల వరకు పూర్తి చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యారడైజ్ ఆలస్యం వల్ల నాని తదుపరి ప్రాజెక్ట్ బ్లడీ రోమియో కూడా వెనక్కి వెళ్లింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ యాక్షన్ ఎంటర్టైనర్‌ ను 2026 ఆరంభంలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారని టాక్.

కానీ ఇప్పుడు ఆ ప్లాన్ ఆరు నెలలు వాయిదా పడింది. దీంతో సుజీత్ ఆ గ్యాప్‌ ను స్క్రిప్ట్ మెరుగుపర్చడానికి వినియోగిస్తున్నారట. కథను మరింత స్ట్రాంగ్‌ గా తయారు చేసి, షెడ్యూల్స్‌ ను పర్ఫెక్ట్‌ గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అయితే షూటింగ్ జూన్‌ లో ప్రారంభమయ్యే అవకాశముంది. 2027 సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మొదట క్రిస్మస్ 2026కు రిలీజ్ చేయాలనుకున్నా, ఇప్పుడు షెడ్యూల్ మారిపోయింది. అయితే నాని ప్లాన్స్ మారినా మంచి కంటెంట్‌ తో రావాలనే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ప్యారడైజ్, బ్లడీ రోమియో ఎప్పుడు రిలీజ్ అవుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News