ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా.. కానీ!
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా ఎవరికీ తెలియని తన ఫ్యామిలీ రహస్యాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.;
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అంటే తెలియని వారు వుండరు.అంతకు ముందు ఆ తరువాత,అరవింద సమేత అనే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ప్రస్తుతం 'ఓం శాంతి శాంతి శాంతిః' చిత్రంతో ప్రేక్షకులకు వచ్చారు. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా ఎవరికీ తెలియని తన ఫ్యామిలీ రహస్యాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
కెరీర్ ముందు...పెళ్లి తర్వాత:
ఈషా రెబ్బా తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని, వారిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయని తెలిపారు. ఇంట్లో వాళ్ల నుంచి పెళ్లి ఒత్తిడి ఉన్నప్పటికీ, తన లక్ష్యం మాత్రం నటనలోనే ఇంకా ఎత్తుకు ఎదగాలని ఆమె పేర్కొన్నారు. "నా సిస్టర్స్ ఇద్దరూ సెటిల్ అయ్యారు. కానీ నేను మాత్రం ఇంకా నటనలో ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు" అని స్పష్టం చేశారు. ఒక తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదని, అందుకే దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నానని ఈషా చెప్పుకొచ్చారు.
ఈషా రెబ్బా కెరీర్ ప్రయాణం:
హైదరాబాద్‌కు చెందిన ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' (2012) చిత్రంతో వెండితెరకు పరిచయమైనా, హీరోయిన్‌గా ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా 'అంతకు ముందు ఆ తరువాత' (2013). ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆమె తనలోని నటిని నిరూపించుకుంది. ఆ తర్వాత 'బందిపోటు', 'అమీ తుమీ', 'దర్శకుడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అ!' (Awe) చిత్రంలో ఆమె చేసిన ప్రయోగాత్మక పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'సుబ్రహ్మణ్యపురం' 'రాగల 24 గంటల్లో' వంటి సినిమాలతో పాటు 'పిట్ట కథలు' 'మాయా బజార్ ఫర్ సేల్' వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా తన ముద్ర వేసింది. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సరసన 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే విభిన్నమైన రూరల్ ఎంటర్‌టైనర్‌తో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఒకప్పుడు పాత్ర గురించి భయపడిన ఈషా, ఇప్పుడు 'ఓం శాంతి శాంతి శాంతిః' వంటి బలమైన కథాంశం ఉన్న చిత్రాలతో తన సత్తా చాటాలని చూస్తోంది. 'జయ జయ జయ జయ హే' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో ఆమె నటనకు ఇప్పటికే మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ జనవరి 30 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. గతంలో చేసిన చిన్న తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ఇప్పుడు కేవలం స్టార్డం కోసం కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తోంది. తరుణ్ భాస్కర్ తో కలిసి ఆమె చేస్తున్న ఈ కొత్త మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఆల్ ది బెస్ట్ ఈషా..