ఈ డాక్యు డ్రామా ట్రంప్ భార్యపై ప్రొపగండా ఫిలిం?
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మెలనియా ట్రంప్ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.;
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మెలనియా ట్రంప్ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ స్వయంగా రచించిన పుస్తకం (ఆటో బయోగ్రఫీ) ఆధారంగా దీనిని రూపొందించారు. అయితే ఈ డాక్యుమెంటరీలో లోటుపాట్లు ఉన్నాయని, ఇది ప్రొపగండా డాక్యుమెంటరీ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో మెలనియా జీవితంలోని వివాదాస్పద అంశాలను చూపించకుండా, కేవలం మంచి విషయాలను మాత్రమే డాక్యుసిరీస్‌లో చూపించారని విమర్శలొస్తున్నాయి.
మాజీ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌పై తీసిన ఈ డాక్యుమెంటరీని చాలామంది రాజకీయ `ప్రచార చిత్రం`గా చూస్తున్నారు. ఇది నియంత్రితమైన కథ అని కూడా విమర్శిస్తున్నారు. దీని కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా 40 మిలియన్ డాలర్లు వెచ్చించడం కూడా చర్చనీయాంశమైంది.
2016లో దుమారం రేపిన మెలనియా కాపీ ప్రసంగం.. మిషెల్ ఒబామా ప్రసంగాన్ని పోలి ఉండటంపై చాలా విమర్శలొచ్చాయి. సరిహద్దుల్లో ఇరు దేశాల పిల్లలను వేరు చేస్తున్న సమయంలో ఒక ప్రత్యేక కోట్ రాసి ఉన్న జాకెట్ ను ధరించడం పెద్ద దుమారం రేపింది. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని డాక్యుమెంటరీలలో స్పష్ఠంగా చూపించలేదు. మెలనియాను బాధ్యతాయుతమైన తల్లిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా, గ్రేస్ ఉన్న ఫస్ట్ లేడీగా చూపిస్తాయి. మెలనియా ఇమేజ్ స్థాయిని పెంచేలా ప్రొపగండా ఫిలింస్ తీస్తే దానిని వెంటనే ప్రజలు గుర్తు పట్టేస్తారు.
అలాగే మెలనియా పై రాసిన పుస్తకం `మెలనియా` కూడా తనకు అనుకూలంగా డిజైన్ చేసినది అని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో వివాదాలు ఉండవు.. కేవలం ప్రచార ప్రొపగండా పుస్తకం అని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. వైట్ హౌస్‌లో ఆమె తీసుకున్న నిర్ణయాలు లేదా డొనాల్డ్ ట్రంప్‌పై మెలనియా ప్రభావం ఎంత అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇక మెలనియా ట్రంప్‌పై డాక్యు సిరీస్‌లో తన జీవితంలో నిజాలను లేదా అబద్ధాలను స్పష్ఠంగా ప్రజలు గుర్తించలేరు
ఏఐ జడ్జి చెప్పే తీర్పు కరెక్ట్:
ఇది మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ సంస్థ తమ ఏఐ టెక్ కంపెనీలకు అనుకూలమైన కంటెంట్ ని రూపొందించి దానిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇకపై సమాజానికి తీర్పులు ఇవ్వడానికి ప్రాణం ఉన్న ఎమోషన్ కి గురయ్యే జడ్జిల అవసరం లేదని, కేవలం ఏఐ జడ్జిలు (న్యాయమూర్తులు) ఇచ్చే తీర్పులు మాత్రమే సరైనవని నమ్మాలని కూడా రుద్దే ప్రయత్నం చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.