రితికా నాయక్ ఖాతాలో హ్యాట్రిక్?

ఢిల్లీ ముద్దుగుమ్మ రితిక నాయక్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈమె పేరు వినిపిస్తోంది.

Update: 2026-08-07 06:03 GMT

ఢిల్లీ ముద్దుగుమ్మ రితిక నాయక్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈమె పేరు వినిపిస్తోంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ కట్టిపడేస్తూ అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇప్పటివరకు కేవలం నటించింది మూడు సినిమాలే అయినా ఆ మూడు సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న రితికా నాయక్ .. ఇప్పుడు నాలుగవ చిత్రంతో కూడా అదే సక్సెస్ సొంతం చేసుకొని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.

మాస్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమెకు ఇది తొలి సినిమానే అయినా.. ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రితికా నాయక్. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా - మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన హాయ్ నాన్న సినిమాలో ఈ జంట కూతురిగా చిన్న పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత తేజా సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమాతో ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరి సత్తాచాటింది. పైగా ఈ సినిమా తేజ సజ్జ కెరియర్ లో హనుమాన్ తర్వాత 100 కోట్లు అందుకున్న రెండవ మూవీ గా నిలిచింది . రితిక నాయక్ ఖాతాలో తొలి 100 కోట్ల మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. అలా హీరోయిన్గా నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ఆమె నటించిన మూడవ చిత్రం కొరియన్ కనకరాజు.

మెగా ఫ్యామిలీ వారసుడైన వరుణ్ తేజ్ 15వ మూవీగా ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 7న వచ్చింది. వాస్తవానికి ఆగస్టు ఆరవ తేదీన ఈ సినిమా ప్రీమియర్స్ పడగా 125 షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనా వేయగా .. ఏకంగా 100 షోలకు హౌస్ ఫుల్ బోర్డులు పడడం గమనార్హం. యు వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడిగా పని చేశారు. వాస్తవానికి ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ హిట్టు చూడలేదు. పైగా తండ్రిగా ఆయన ప్రమోట్ అయ్యారు. కాబట్టి ఆయనకు అర్జెంటుగా హిట్ అవసరం . అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అని ఏకంగా జానర్ మార్చి ప్రేక్షకుల ముందుకు వచ్చారు వరుణ్ తేజ్.

ఈ సినిమా ప్రీమియర్ షో తోనే రికార్డు సృష్టించింది. పైగా హౌస్ ఫుల్ బోర్డులు పడడం గమనార్హం . ఏదిఏమైనా ఈ సినిమా కూడా మొదటి షో తోనే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోండి.ఇక దీని బట్టి చూస్తే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రితిక నాయక్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ మూడు సినిమాలతో హీరోయిన్గా హార్ట్రిక్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది రితికా నాయక్. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ ఈమెను గోల్డెన్ లెగ్ అని కూడా సంబోధిస్తున్నారు.

Tags:    

Similar News