ఫోన్ అవసరమే కానీ, లిమిటెడ్ గానే వాడాలి
సర్జరీ తర్వాత సాధారణ పనులు చేయడానికి కూడా ఇతరుల సహాయం అవసరమవుతోందని షకీలా చెప్పారు.
నటి షకీలా ఇటీవల మెడకు సర్జరీ చేయించుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో రిలీజ్ చేసిన ఆమె, ప్రస్తుతం కోలుకుంటున్నానని అభిమానులకు తెలియజేశారు. వీడియోలో షకీలా మెడకు సపోర్ట్‌గా నెక్ కాలర్ ధరించి కనిపించగా, హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకున్న విజువల్స్ తో పాటూ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశారు.
సర్జరీ తర్వాత సాధారణ పనులు చేయడానికి కూడా ఇతరుల సహాయం అవసరమవుతోందని షకీలా చెప్పారు. మంచం నుంచి లేవడం, ఫుడ్ తీసుకోవడం వంటి రోజువారీ పనుల్లో కేర్‌టేకర్ల సహకారం తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ వినియోగంపై ఆమె ప్రత్యేకంగా హెచ్చరించారు. తన అనుభవాన్ని వివరిస్తూ, ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో మొబైల్ ఫోన్ వాడటం వల్ల మెడపై తీవ్ర ప్రభావం పడిందని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా పక్కకు తిరిగి పడుకుని గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వీడియోలు, రీల్స్ రెగ్యులర్‌గా చూడటం వల్ల మెడకు సంబంధించిన సమస్యలు క్రమంగా పెరిగాయని చెప్పారు. ఈ పరిస్థితి చివరకు సర్జరీ వరకు వెళ్లిందని వెల్లడించారు. ట్రీట్‌మెంట్ కు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అయ్యిందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆర్థికంగా, శారీరకంగా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఫోన్ అనేది అవసరమైన సాధనం అయినప్పటికీ, దాన్ని లిమిటెడ్‌గానే ఉపయోగించాలని సూచించారు. అలాగే చిన్నపిల్లలకు గ్యాడ్జెట్లు అలవాటు చేయడం కూడా మంచిది కాదని తల్లిదండ్రులకు సూచించారు. ఇక షకీలా సినీ కెరీర్ ను పరిశీలిస్తే, నెల్లూరు దగ్గరలో పుట్టిన ఆమె మలయాళ సినీ ఇండస్ట్రీలో ఒక దశలో సెన్సేషనల్ సక్సెస్‌లు సాధించారు. 2000లో రిలీజైన కిన్నరతుంబికల్ సినిమా ఆమెకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత తమిళ, తెలుగు, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించారు. థొట్టి గ్యాంగ్, జయం, బంగారం, అళగియా తమిళ్ మగన్, శివ మనసులో శక్తి, బాస్ ఎంగిర భాస్కరన్ వంటి సినిమా షకీలా కనిపించారు. తన హెల్త్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకుంటూ, డిజిటల్ పరికరాల వినియోగంలో జాగ్రత్త అవసరమనే షకీలా ఇచ్చిన మెసేజ్‌ను పలువురు అభినందిస్తున్నారు.