రూట్ మార్చిన షారుఖ్..
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కింగ్ ఖాన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్.;
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కింగ్ ఖాన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్. విలక్షణమైన నటుడిగా, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మరింత క్రేజ్ దక్కించుకున్న ఈయన తన చిత్రాల విషయంలో రూట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అయినప్పటికీ ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలపై, ఆ సినిమాలలోని పాత్రలపై మనసు పారేసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కింగ్ ను మెప్పించిన ఆ పాత్రలేంటి ? ఆయన సౌత్ సినిమాలలో నటిస్తున్నారా? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..
గత వారం రోజులుగా బాలీవుడ్ షారుక్ ఖాన్ సౌత్ సినిమాలలో నటిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి కూడా షారుక్ ఖాన్ గురించి చేసిన కామెంట్లు వింటే మాత్రం ఇది నిజమనే అనిపిస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి మేకర్స్ కంటే ముందే బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.." జైలర్ 2 సినిమా కథ నన్ను ఎంతగానో మెప్పించింది. ఇందులో రజినీకాంత్, మోహన్ లాల్, షారుక్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ వంటి భారీతారాగణం ఉండబోతోంది " అంటూ తెలిపారు. అయితే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇప్పటివరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎప్పుడైతే మిధున్ లాంటి సీనియర్ నటుడు స్వయంగా ఆయన పేరు ప్రస్తావించడంతో సౌత్ సినిమాలపై ఆసక్తితోనే షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో భాగమయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రజనీకాంత్ , షారుక్ ఓకే ప్రేమలో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాడం ఖాయమని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే షారుక్ ఖాన్ సౌత్ సినిమాలలో నటించడమే కాకుండా సౌత్ సినిమాలలో భారీ పాపులారిటీ అందుకున్న పాత్రలను కూడా ఆయన రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం కింగ్. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు ఎమోషనల్ డ్రామాగా సాగబోయే చిత్రంలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఈ సినిమాతో తొలిసారి థియేట్రికల్ డెబ్యూ ఇవ్వనుంది.
పఠాన్ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల తర్వాత ఆనంద్ సిద్ధార్థతో షారుక్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ అంచనాలు ఇటు సౌత్ లో కూడా పెరగడానికి కారణం ఆయన చేస్తున్న పాత్ర. అసలు విషయంలోకి వెళ్తే షారుక్ ఖాన్ ఈ సినిమాలో గత 20 ఏళ్ల క్రితం మహేష్ బాబు నటించిన అతడు సినిమాలోని పాత్రను పోలి ఉంటుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు 2005లో చేసిన చిత్రం అతడు. ఇందులో ప్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాత్ర ఆయన సినీ కెరియర్ లోనే మైలురాయిగా నిలిచింది. అలాంటి పాత్రలో ఇప్పుడు షారుక్ ఖాన్ తన కింగ్ సినిమాలో పోషించనున్నట్లు సమాచారం. అయితే కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే బాలీవుడ్ సినిమాల నుండి తన రూట్ ను మార్చుకొని.. ఇటు సౌత్ సినిమాలపై మక్కువ పెంచుకుంటున్నారు షారుక్ ఖాన్. అందులో భాగంగానే సౌత్ సినిమాలలో నటించడమే కాకుండా సౌత్ సినిమాల పాత్రలను కూడా ఇప్పుడు రీమేక్ చేసి సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారు . మరి ఆయన మార్చుకున్న ఈ రూట్ ఆయనకు ఏ విధంగా విజయాన్ని అందిస్తుందో చూడాలి.