సీనియర్స్ లో బాలయ్య ఒక్కడే అలా!
ఫిట్ నెస్ విషయంలో సెలబ్రిటీలు ఎంత కేర్ ఫుల్ గా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. రోజులో రెండు గంటలు తప్పక వ్యాయామానికి కేటాయిస్తారు.;
ఫిట్ నెస్ విషయంలో సెలబ్రిటీలు ఎంత కేర్ ఫుల్ గా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. రోజులో రెండు గంటలు తప్పక వ్యాయామానికి కేటాయిస్తారు. ఒకప్పుడు ఫిట్ నెస్ పరంగా బాలీవుడ్ తారలు హైలైట్ అయ్యేవారు. ఇప్పుడు వాళ్లను మించిన ఫిట్ నెస్ ప్రీక్ లుగా టాలీవుడ్ స్టార్లు తయారవుతున్నారు. ఫిట్ నెస్ విషయంలో ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండటం లేదు. కేవలం పాత్ర అవసరం మేరకే కాకుండా ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్దతో శ్రమిస్తున్నారు. దీంతో రెండు రకాల లాభాలు పొందుతున్నారు. మంచి ఆరోగ్యంతో పాటు కావాల్సిన లుక్ లోకి మారిపోతున్నారు.
సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున ఈ విషయంలో ఎప్పటి నుంచో ముందుంటున్నారు. వెంకటేష్ మంచి బాడీషేప్ మెయింటెన్ చేయడం అన్నది కొన్ని దశాబ్దలుగా జరుగుతోంది. ఇప్పటికీ నాగార్జున అదే స్మార్ట్ లుక్ లో అలరిస్తున్నారు. వీరిద్దరిని చూసి...ప్రత్యేకించి నాగార్జున స్పూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా స్మార్ట్ లుక్ లోకి మారిపోయారు. ఇప్పటి వరకూ లుక్ పరంగా పెద్దగా పట్టించుకోలేదు గానీ తాను కూడా మారాలని చిరంజీవి కసరత్తులు మొదలు పెట్టి రూపంలో చాలా మార్పులే తీసుకొచ్చారు. వింటేజ్ లుక్ లో వైరల్ అవుతోన్న చిరంజీవి తాజా ఫోటోలే అందుకు నిదర్శనం.
ఈ స్మార్ట్ లుక్ లోనే శంకర ప్రసాద్ లో అలరించనున్నారు. ఇకపై అన్నయ్య ఇదే లుక్ ని మెయింటెన్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. వాళ్ల కోరిక సహా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిరు కసరత్తులు వదిలే ఛాన్సే ఉండదు. ఇక సీనియర్లలలో మిగిలింది ఎవరు? అంటే నటసింహ బాలకృష్ణ. ఇంత వరకూ బాలయ్య జిమ్ వీడియోలు ఎక్కడా బయటకు రాలేదు. ఫిట్ నెస్ పరంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్న డేటా కూడా లేదు. ఆన్ స్క్రీన్ పై బాలయ్య లుక్ కోసం ప్రత్యేక కసరత్తులు అవసరం లేదు. బాలయ్య స్వాగ్ తోనే చెల్లిపోతుంది.
కానీ ఇంత వరకూ బాలయ్య లుక్ పరంగా మార్పులు తీసుకొచ్చే పాత్రల్లో కనిపించలేదు. ఆ జానర్ స్టోరీలు బాలయ్యకు రాకపోవడంతో? ఆయనా ఛాన్స్ తీసుకోలేదు. కానీ వస్తే బాలయ్య కూడా అంతకుమించి శ్రమిస్తారు. అతడెప్పుడు దర్శకుల హీరోనే. వెండి తెరపై దర్శకుల హీరోగా కనిపించడం కోసం ఎంతైనా కష్టపడతారు. మరి ఆ ఛాన్స్ 11వ సినిమాకు ఉంటుందా? ఉండదా? అన్నది చూడాలి. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో 111వ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.