కుబేర విష‌యంలో మొద‌టి విజ‌యం అదే!

ధ‌నుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కుబేర‌. నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుంది.;

Update: 2025-06-30 08:41 GMT

ధ‌నుష్ హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కుబేర‌. నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుంది. ఎప్పుడూ సెన్సిబుల్ ల‌వ్ స్టోరీలను తెర‌కెక్కించే శేఖ‌ర్ క‌మ్ముల నుంచి కుబేర లాంటి సినిమా చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. త‌క్కువ టైమ్ లోనే రూ.100 కోట్ల మార్కెట్ లోకి అడుగ‌పెట్టిన ఈ సినిమా స‌క్సెస్ విష‌యంలో శేఖ‌ర్ క‌మ్ముల ఎంతో ఆనందంగా ఉన్నారు.

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు అన్ని విష‌యాల్లోనూ మార్పులొచ్చాయ‌ని, ఒక‌ప్పుడు 20 ఏళ్ల వారికి తెలిసే విష‌యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్యమా అని 10 ఏళ్ల పిల్ల‌ల‌కే తెలిసిపోతున్నాయ‌ని, ఇంత ఫాస్ట్ జెన‌రేష‌న్ కు త‌గ్గ‌ట్టు క‌థ రాయ‌గ‌లనా అని క‌థ మొద‌లుపెట్టే ముందు తాను అనుకున్న‌ట్టు శేఖ‌ర్ క‌మ్ముల తెలిపారు.

అంద‌రినీ మెప్పించే క‌థ రాయ‌డ‌మే కుబేర విష‌యంలో తాను అందుకున్న మొద‌టి విజ‌యమ‌ని, కుబేర లాంటి క‌థ‌తో తెర‌కెక్కిన సినిమాను తీయ‌డం అంత ఈజీ కాద‌ని, సినిమాలో ఎలాంటి ల‌వ్ స్టోరీ, సాంగ్స్ లేకుండా క‌థ‌ను మూడు గంట‌ల పాటూ న‌డిపించ‌డ‌మంటే మాట‌లు కాద‌ని, కేవ‌లం క‌థ‌తో ఆడియ‌న్స్ ను మెప్పించ‌డం చాలా కష్ట‌మ‌ని, కానీ తాను ఆ టెస్ట్ లో క‌థ విష‌యంలోనే పాసైన‌ట్టు తెలిపారు శేఖ‌ర్.

కుబేర క‌థ చాలా పెద్ద‌ద‌ని, కానీ సినిమా పెద్ద‌దైపోతుంద‌ని ర‌న్ టైమ్ ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను వీలైనంత షార్ప్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేశామ‌ని, తెలుగు ఆడియ‌న్స్ కు సినిమా అంటే 2 గంట‌ల 45 నిమిషాలు అనే ఫీలింగ్ ఉండిపోయింద‌ని, దాని కంటే మ‌రికొన్ని నిమిషాలు ఎక్కువున్నా పెద్ద సినిమాగా భావిస్తూ ర‌న్ టైమ్ ఎక్కువ అంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. కుబేర క‌థ‌ను ఇంత‌కంటే ఎడిట్ చేయ‌డం త‌మ వ‌ల్ల కాలేద‌ని, రిలీజ్ కు ముందు ఈ విష‌యంలో చాలా టెన్ష‌న్ ప‌డ్డాన‌ని, కానీ రిలీజ్ త‌ర్వాత ఆడియ‌న్స్ నుంచి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషించిన‌ట్టు శేఖ‌ర్ క‌మ్ముల చెప్పారు.

Tags:    

Similar News