హీరోయిన్‌ రికార్డ్‌... పీరియడ్స్‌ టైంలో 113 కి.మీ రేసు!

హీరోయిన్స్‌లో కొందరు రియల్‌ అథ్లెట్స్‌ కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న అథ్లెట్‌ హీరోయిన్స్‌లో సయామీ ఖేర్‌ ఒకరు. ఈమె హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది.;

Update: 2025-07-12 08:07 GMT

సాధారణంగా హీరోయిన్స్‌ సున్నితంగా, సుకుమారంగా ఉంటారని అంతా భావిస్తారు. కానీ వారు అందంగా కనిపించడం కోసం, సన్నగా, నాజూకుగా కనిపించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఒకప్పటి హీరోయిన్స్‌తో పోల్చితే ప్రస్తుత హీరోయిన్స్ మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంటున్నారు. అన్ని విధాలుగా ముందు ఉంటున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాల కోసం హీరోలను మించిన సాహసాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ ఫిజికల్‌ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని విధాలుగా ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ను దక్కించుకోవడం కోసం గంటల తరబడి వర్కౌట్లు చేస్తున్నారు.

హీరోయిన్స్‌లో కొందరు రియల్‌ అథ్లెట్స్‌ కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న అథ్లెట్‌ హీరోయిన్స్‌లో సయామీ ఖేర్‌ ఒకరు. ఈమె హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. పదేళ్ల క్రితం అంటే 2015లో రేయ్‌ సినిమాతో సాయి ధరమ్‌ తేజ్‌తో కలిసి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయింది. అయినా కూడా లక్కీగా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి. హిందీ, తెలుగుతో పాటు మరాఠీ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సయామీ ఖేర్‌ మరో వైపు అథ్లెట్‌గానూ తన సత్తా చాటుతూ వస్తుంది. ముఖ్యంగా ఈమె సైక్లింగ్‌లో పలు జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌లో పాల్గొనడం మాత్రమే కాకుండా పథకాలు సాధించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

తాజాగా సయామీ ఖేర్‌ 'ఐరన్‌ మ్యాన్‌ 70.3' ట్రయాథ్లాన్‌ను పూర్తి చేసి పథకంను సొంతం చేసుకుంది. సాధారణంగా క్రీడాకారులు ఒక్క గేమ్‌లోనే పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ ట్రయాథ్లాన్‌లో పేరుకు తగ్గట్లుగా మూడు స్పోర్ట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. మొదటగా 1.9 కిలో మీటర్ల దూరం స్విమ్మింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్‌ పూర్తి చేసిన వెంటనే ఏకంగా 90 కిలో మీటర్ల దూరం సైక్లింగ్‌ చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్‌ పూర్తి చేసిన వెంటనే రన్నింగ్‌ చేయాల్సి ఉంటుంది. 21.1 కిలోమీటర్ల మేరకు పరిగెత్తితే ట్రయాథ్లాన్‌ రేసు పూర్తి అవుతుంది. ఈ రేసు ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. వివిధ దేశాల్లో ఈ రేసును నిర్వహిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం.

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన రేసులో పాల్గొన్న సయామీ ఖేర్‌ ఈ ఐరన్‌ మ్యాన్‌ 70.3 ట్రయాథ్లాన్‌ విజేతగా నిలిచింది. ఈ రేసులో మొత్తం 113 కిలోమీటర్ల పాటు అథ్లెట్స్ చేరుకోవాల్సి ఉంటుంది. 113 కిలో మీటర్లు అంటే 70.3 మైల్స్‌గా లెక్కిస్తారు. ఇది ఐరన్‌ మ్యాన్‌ రేసులో సగం అందుకే దీన్ని హాఫ్ ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అని కూడా అంటారు. గత ఏడాదిలో విజేతగా నిలిచిన ఈమె ఇప్పుడు మరోసారి విజేతగా నిలవడం తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంట వెంటనే ఈమె ఈ రేసులో గెలిచిన అథ్లెట్‌గా అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఇండియన్ హీరోయిన్స్‌లో ఈ ఘనత దక్కించుకున్న ఏకైక ముద్దుగుమ్మ గా ఈమె నిలిచింది.

తాజా ట్రయాథ్లాన్‌ రేసులో పాల్గొన్న టైమ్‌లో సయామీ ఖేర్‌కి పీరియడ్స్‌ టైమ్‌. అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా, మానసికంగా దృఢంగా ముందుకు సాగింది. సాధారణంగా పీరియడ్స్ టైమ్‌లో చాలా మంది ఆడవారు కనీసం ఇళ్లు దాటరు. వారందరికీ సయామీ ఖేర్ ఆదర్శం కావాలి. పీరియడ్స్ టైమ్‌లో ఉన్న బాధను భరించలేక ఇబ్బంది పడే వారు ఎంతో మంది ఉంటారు. అలాంటిది పీరియడ్స్‌ టైమ్‌లో ఏకంగా 113 కిలో మీటర్ల రేసును పూర్తి చేసి విజేతగా నిలిచిన సయామీ ఖేర్‌ను ఎంతగా అభినందించినా తక్కువే అని నెటిజన్స్‌, ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News