• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజ‌ర్ టాక్: స‌ప్త...

టీజ‌ర్ టాక్: స‌ప్త స‌ముద్రాలు దాటిన ప్రేమ

| బ్యాక్ గ్రౌండ్ ఎమోష‌నల్ గా క‌నెక్ట్ అవుతుంది. బ‌ల‌మైన ప్రేమ క‌థ‌గా తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-09-16 13:17 GMT

రిక్షిత్ ..రుక్మిణి వసంత్ జంట‌గా హేమంత్ ఎం. రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌న్న‌డ చిత్రం 'స‌ప్త సాగార దాచే' ఇటీవ‌ల విడుద‌లై క‌న్న‌డ‌లో మంచి విజ‌యం సాధించింది. అక్క‌డ క్లాసిక్ హిట్ అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ తెలుగులోకి అనువ‌దిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది.

టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఓ పాత టేప్ రికార్డులో మ‌నుని త‌లుచుకుంటూ ప్రియ ప్రేమని రికార్డు చేస్తుంది. 'మ‌ను నా ఆశ ఏంటో తెలుసా? ఊళ్లో స‌ముద్రం ఉంది క‌దా! ఆ స‌ముద్రం ఒడ్డున నీతో జీవితాంతం న‌డుస్తూనే ఉండాలి. అల‌లు ఒక్కోక్క‌టిగా వ‌చ్చి మ‌న పాదాలు త‌డుపుతుంటే నేను నీచేతులు గ‌ట్టిగా ప‌ట్టుకోవాలి. ఆ అల‌ల శ‌బ్దాన్ని అలా వింటుంటేగ‌ట్టిగా పాడాల‌ని పిస్తుంది మ‌ను.

నీకెప్పుడు చెప్ప‌లేదు గానీ నీతో ఉన్న‌ప్పుడు కూడా అలాగే అనినిస్తుంది. నా స‌ముద్రం నువ్వు' అంటూ సాగే వాయిస్ ఓవ‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఇద్ద‌రి ప్రేమికుల గుండె చ‌ప్పుడిది. ఆ ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం ప్రేమికులు ఎంత మ‌నో వేద‌న‌కి గుర‌య్యారు? అన్న‌ది టీజ‌ర్ లో హైలైట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ ఎమోష‌నల్ గా క‌నెక్ట్ అవుతుంది. బ‌ల‌మైన ప్రేమ క‌థ‌గా తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది.

ఇందులో ఓ బిజినెస్‌మెన్ వ‌ద్ద కార్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే మ‌ను అనే యువ‌కుడిగా ర‌క్షిత్‌శెట్టి.. సింగ‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌నే ప్రియ అనే అమ్మాయిగా రుక్మిణి వ‌సంత్ క‌నిపించారు. బిజినెస్‌మెన్ కుమారు చేసిన ఓ త‌ప్పిదం కార‌ణంగా వాళ్లు ఎలా దూర‌మయ్యారు అనేది మెయిన్ థీమ్. సెప్టెంబ‌ర్ 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాను మాతృక‌లో రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించారు. 'స‌ప్త సాగర దాచే ఎల్లో సైడ్' ఏ పేరుతో పార్ట్ వ‌న్‌ను రిలీజ్ చేశారు. స‌ప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీ టైటిల్‌తో సీక్వెల్ అక్టోబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Full View
Tags:    
  • Rakshithshetty 
  • Saptasagaraludhaati 
  • Teasertalk 
  • Rukmini 
  • Hemanthmrao 
  • Movieteaser 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS