• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ తో ఆశలు.. సినిమా...

ట్రైలర్ తో ఆశలు.. సినిమా నిరాశలు..!

| డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్

By - Tupaki Desk
Update: 2023-07-19 04:40 GMT

డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా వరుస ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏక్ మిని కథతో ఓటీటీ హిట్ అందుకున్న అతను ఆ తర్వాత హిట్ కోసం వరుసగా సినిమాలు చేస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. ఈ ఏడాది ఆల్రెడీ 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ ఆ మూడింటిలో ఒక్కటి కూడా హిట్ అందుకోలేకపోయాడు. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న సంతోష్ శోభన్ లేటెస్ట్ గా మరో మూవీతో వస్తున్నాడు. సంతోష్ శోభన్ హీరోగా అభిషేక్ మహర్షి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రేమ్ కుమార్.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే పెళ్లి కోసం హీరో పడే తిప్పల.. తనకు పెళ్లి కాదని తెలిసి పెళ్లిళ్లు చెడగొట్టేందుకు ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి అలా పెళ్లిల్లు చెడగొడుతుండటం అలా ఒక హీరో పెళ్లి చెడగొట్టాలని డీల్ చేసుకుని ఆ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యే కథతో ప్రేం కుమార్ వస్తుంది. ప్రేమ్ కుమార్ ట్రైలర్ కూడా సంతోష్ శోభన్ ఈసారి హిట్ కొట్టేస్తాడు అనేలా ఉంది. విచిత్రం ఏంటంటే సంతోష్ శోభన్ సినిమాలేమో కానీ అతను చేసిన సినిమాల ట్రైలర్స్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ప్రేమ్ కుమార్ మాత్రమే కాదు కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే ఈ ట్రైలర్స్ అన్నీ చూస్తే పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. తీరా సినిమాకి వెళ్లి చూస్తే మాత్రం నిరాశ చెందక తప్పట్లేదు.

ప్రేమ్ కుమార్ ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గానే అనిపించింది. మరి సంతోష్ శోభన్ ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి. ట్రైలర్ తో ఆశలు నెలకొల్పే సంతోష్ శోభన్ సినిమాతో మాత్రం నిరాశ కలిగిస్తున్నాడు.

యాక్టింగ్ పరంగా తను ఓకే అనిపించుకుంటున్నా సరే ఎంచుకున్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విఫలమవుతున్నాడు. సంతోష్ శోభన్ సినిమాల ఫలితాల విషయంలో దర్శకుల ఫెయిల్యూర్ కూడా ఉంది. అన్నిటికీ మించి కుర్రాడికి లక్ కలిసి రావట్లేదు. కొద్దిగా లక్ కూడా తోడైతే వరుస సినిమాలతో మంచి ఎంటర్టైనింగ్ సినిమాలను అందించాలని చూస్తున్నాడు సంతోష్ శోభన్. మరి ప్రేమ్ కుమార్ అయినా అతని ఆశలను నిజం చేస్తుందా లేదా అన్నది చూడాలి.

హిట్ వచ్చే దాకా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు సంతోష్ శోభన్. అయితే థియేట్రికల్ హిట్ కాకపోయినా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో బడ్జెట్ రికవర్ అవుతున్న కారణంగా అతనికి వరుస సినిమాలు వస్తున్నాయని తెలుస్తుంది.

Tags:    
  • DirectorShobanSon 
  • SantoshShoban 
  • EkMiniKatha 
  • PremKumarFilm 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS