సంక్రాంతి చిత్రాలు.. US బాక్సాఫీస్ ఇలా..

ఇప్పుడు నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి చిత్రాల బుధవారం వసూళ్ల వివరాలు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అన్ని సినిమాలు కూడా స్టేబుల్ గా వసూళ్లను సాధిస్తుండడం విశేషం.;

Update: 2026-01-16 13:26 GMT

థియేటర్స్ లో సినీ సంక్రాంతి సందడి కొనసాగుతోంది. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఏకంగా ఐదు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. అయితే సెలవులు కావడంతో థియేటర్స్ కు ఆడియన్స్ తరలివస్తున్నారు. దీంతో అన్ని సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా స్ట్రాంగ్ వసూళ్లు సాధిస్తున్నాయి.

ఇప్పుడు నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి చిత్రాల బుధవారం వసూళ్ల వివరాలు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అన్ని సినిమాలు కూడా స్టేబుల్ గా వసూళ్లను సాధిస్తుండడం విశేషం. మరి బుధవారం నాడు నార్త్ యూఎస్ లో ఏ సినిమా ఎంత రాబట్టింది? ఇప్పటి వరకు ఎంత సాధించింది? అన్న వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఉత్తర అమెరికాలో బుధవారం రోజు ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా అనగనగా ఒక రాజు నిలిచింది. ఆ సినిమా ఒక్కరోజులో సుమారు 2 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్లు 5 లక్షల డాలర్లు దాటాయి. అలా థియేటర్స్ లో ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పాలి. స్టోరీ, కామెడీ క్లిక్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తరలివెళ్తున్నారు.

అనగనగా ఒక రాజు మూవీతోపాటు మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్‌ ను కొనసాగిస్తోంది. బుధవారం ఆ సినిమా దాదాపు 1.7 లక్షల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే నార్త్ అమెరికాలో ఆ సినిమా కలెక్షన్లు ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటాయి. అదే సమయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టేబుల్ గా వసూళ్లను సాధిస్తోంది.

బుధవారం రోజున ఆ సినిమా సుమారు 20 వేల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 1.2 లక్షల డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. నారీ నారీ నడుమ మురారి నార్త్ అమెరికాలో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. బుధవారమే సినిమా రిలీజ్ అవ్వగా.. తొలి రోజు సుమారు 72 వేల డాలర్లు వసూలు చేసింది. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక ది రాజా సాబ్ ఇప్పటికే నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్లు సాధించింది. సినిమా రిలీజ్ అయ్యి వారం అవ్వగా.. బుధవారం మరో 17 వేల డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్లు 2.3 మిలియన్ డాలర్లకు చేరాయి. మొత్తానికి నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలు తమ స్థానం నిలబెట్టుకుంటుండగా, మీడియ్ రేంజ్ చిత్రాలు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నా, పండుగ వాతావరణం కారణంగా థియేటర్లలో సందడి మాత్రం ఇంకా కొనసాగుతోంది.

Tags:    

Similar News