సంక్రాంతి చిత్రాల టికెట్లు.. MSGదే హవా అంతా!
ప్రస్తుతం సినీ సంక్రాంతి సందడి జోరుగా సాగుతోంది. ఏకంగా ఐదు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్ అవ్వడంతో.. థియేటర్స్ కళకళలాడుతున్నాయి.;
ప్రస్తుతం సినీ సంక్రాంతి సందడి జోరుగా సాగుతోంది. ఏకంగా ఐదు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్ అవ్వడంతో.. థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో పెద్ద వాళ్ల నుంచి చిన్న వాళ్ల వరకు అంతా సినిమాలు చూసేందుకు పోటీపడుతున్నారు. పొంగల్ కానుకగా వచ్చిన అన్ని చిత్రాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడ్వాన్స్ గానే ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు బుక్ మై షోలో గత 24 గంటల్లో నమోదైన సినిమా టికెట్ బుకింగ్ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంక్రాంతి సీజన్ నేపథ్యంలో థియేటర్లలో సినిమాల సందడి పెరుగుతుండగా, ప్రేక్షకుల ఆసక్తి ఏ సినిమాపై ఎక్కువగా ఉందో ఆ ట్రెండ్స్.. క్లియర్ గా చూపిస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా టాప్ లో నిలిచింది.
బుక్ మై షో డేటా ప్రకారం, గత 24 గంటల్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఏకంగా 4,24,520 టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ లిస్ట్ లోని ఇతర సినిమాల కన్నా చాలా ఎక్కువ కావడం గమనార్హం. చిరంజీవి అభిమానులు మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీపై భారీ ఆసక్తి చూపుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో ప్రీ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయని చెప్పాలి.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత రెండో స్థానంలో అనగనగా ఒక రాజు సినిమా నిలిచింది. ఆ చిత్రానికి గత 24 గంటల్లో 1,84,550 టికెట్లు అమ్ముడయ్యాయి. మూడో స్థానంలో పరాశక్తి సినిమా ఉండగా, దానికి 1,33,350 టికెట్లు బుక్ అయ్యాయి. నాలుగో స్థానంలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఉంది. ఆ మూవీకి 79,930 టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఓసారి లిస్ట్ రూపంలో సినిమాలు, బుక్ అయిన టికెట్ల కౌంట్ ను తెలుసుకుందాం.
మన శంకర వరప్రసాద్ గారు - 424.52K
అనగనగా ఒక రాజు - 184.55K
పరాశక్తి - 133.35K
ది రాజా సాబ్ - 79.93K
నారీ నారీ నడుమ మురారి - 79.27K
తలైవర్ తంబి తలైమైయిల్ - 57.53K
ధురంధర్ - 54.92K
భర్త మహాశయులకు విజ్ఞప్తి - 50.68K
వా వాతియార్ - 41.92K
సర్వం మాయ - 33.58K
అవతార్ ఫైర్ అండ్ యాష్ - 20.06K
సిరై - 16.89K
హ్యాపీ పటేల్ - 7.89K
ఇక్కిస్ - 6.31K
మొత్తంగా చూస్తే, బుక్ మై షో లెక్కలు ప్రస్తుతం థియేటర్లలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా హవా నడుస్తోందని క్లియర్ గా చెబుతున్నాయి. చిరంజీవి స్టార్ పవర్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటమే ఆ మూవీ భారీ బుకింగ్స్ కు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు అంటున్నారు. వీకెండ్ కావడంతో మరింతగా థియేటర్స్ కు ఆడియన్స్ తరలి వెళ్తున్నట్లు చెబుతున్నారు.