గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ నటుడు
సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా తమ మంచి మనసుని చాటుకుంటూ ఉంటారు.;
సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా తమ మంచి మనసుని చాటుకుంటూ ఉంటారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ మంచి మనసుని చాటుకోగా ఇప్పుడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా తన గొప్ప మనసుని చాటుకున్నారు. ఇండస్ట్రీలోని హీరోలకు ఫ్యాన్స్ ఉండటం మామూలే. వారి కోసం ఏమైనా చేయడానికి కూడా ఆ ఫ్యాన్స్ వెనుకాడరు.
అభిమాని నుంచి రూ.72 కోట్ల ఆస్తి
అందులో భాగంగానే సంజయ్ దత్ అభిమాని ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని అతని పేరుపై రాసిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన ఈ ఘటన గురించి తాజాగా సంజయ్ దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తన అభిమాని నిషా పాటిల్ తనకున్న రూ.72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్ పేరు మీద రాస్తూ వీలునామా రాశారు.
తిరిగి వారి కుటుంబానికే ఇచ్చేశా
నిషా పాటిల్ అనారోగ్యంతో చనిపోగా, వీలునామా ప్రకారం ఆ ఆస్తిని సంజయ్ దత్ కు ఇవ్వడానికి అధికారులు ఆయన్ను సంప్రదించారని, కానీ ఆ ఆస్తిని నిషా పాటిల్ కుటుంబ సభ్యులకే తిరిగి ఇచ్చేశానని సంజయ్ దత్ తెలిపారు. ఆ ఆస్తిని తిరిగి ఇవ్వడంతో సంజయ్ దత్ మంచి మనసుని ప్రశంసిస్తూ అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు. 2018లో మరణించిన నిషా పాటిల్‌ను ఆయన ఒక్కసారి కూడా కలవకపోవడం ఆశ్చర్యకరం.
అఖండ2లో కీలక పాత్ర
తనకు అభిమానుల నుంచి ప్రేమ, అభిమానం, ఆదరణ మాత్రమే చాలని, వారిచ్చే ఎలాంటి ఆస్తులు తనకు అవసరం లేదని, అభిమానులు చూపించే ప్రేమకు తాను కృతజ్ఞుడినని, ఆమె ఎప్పుడూ కలవకపోయినా తనపై ఇంత అభిమానాన్ని చూపించినందుకు తానెప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఇయర్ భూత్నీ, హౌస్‌ఫుల్5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంజయ్ దత్ అఖండ2లో కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ లో కూడా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.