• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నటిని పెళ్లాడబోతున్న కలర్...

నటిని పెళ్లాడబోతున్న కలర్ ఫోటో డైరెక్టర్.. ఎంగేజ్మెంట్ లో ఇలా..

| తాజాగా చాందిని రావు, సందీప్ రాజ్ నిశ్చితార్ధం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది.

By - Tupaki Desk
Update: 2024-11-12 06:00 GMT

'కలర్ ఫోటో' సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు సందీప్ రాజ్. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సందీప్ రాజ్ 'కలర్ ఫోటో' తో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమాతో నేషనల్ అవార్డుని సైతం ఆదుకోవడంతో ప్రముఖ నిర్మాతలు సీనియర్ స్టార్స్ కూడా అతన్ని ప్రత్యేకంగా అభినందించారు.

 

తరువాత 'హెడ్ అండ్ టైల్స్ వెబ్ సిరీస్', 'గుడ్ లక్ సఖి', 'ముఖచిత్రం' లాంటి సినిమాలకి సందీప్ రాజ్ రైటర్ గా వర్క్ చేశాడు. టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ రైటర్ గా సందీప్ రాజ్ కి పేరుంది. ఇదిలా ఉంటే ఈ రైటర్ కమ్ డైరెక్టర్ కి రీసెంట్ గా నటి చాందిని రావుతో ఎంగేజ్మెంట్ జరిగింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన చాందిని రావు 'కలర్ ఫోటో' సినిమాలో ఓ క్యారెక్టర్ లో కనిపించింది.

ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందంట. తరువాత సందీప్ రాజ్ రైటర్ గా వర్క్ చేసిన 'హెడ్ అండ్ టైల్స్' వెబ్ సిరీస్ లో ఆమె ఒక హీరోయిన్ గా చేసింది. తాజాగా చాందిని రావు, సందీప్ రాజ్ నిశ్చితార్ధం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. త్వరలో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నిశ్చితార్ధ వేడుకకి రోషన్ కనకాల, కమెడియన్ హర్ష, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో పాటు వర్ధమాన సినీ దర్శకులు, రచయితలు హాజరయ్యారు.

హర్ష తన ఇన్ స్టాగ్రామ్ లో సందీప్ రాజ్, చాందినిరావు ఎంగేజ్మెంట్ ఫోటోని షేర్ చేసి వారికి విషెస్ తెలియజేశారు. అయితే పెళ్లి ఎప్పుడనేది ఇంకా డేట్ ఎనౌన్స్ చేయలేదు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న న్యూస్ కూడా బయటకొచ్చింది. చాందిని రావు 'వల' అనే మరో చిత్రంలో కూడా లీడ్ రోల్ చేసింది. ఇదిలా ఉంటే సందీప్ రాజ్ ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ తో 'మోగ్లీ' అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ కొట్టాలనే కసితో సందీప్ రాజ్ ఉన్నారు.

ఇదిలా ఉంటే సందీప్ రాజ్ రైటర్, డైరెక్టర్ గా చేస్తూనే నటుడిగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు. అయితే ఎక్కువగా గెస్ట్ అప్పీరియన్స్ రోల్స్ లోనే కనిపించాడు. నటుడిగా కూడా సందీప్ రాజ్ తనని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. అంతే కాకుండా బిగ్ స్టార్స్ తో కూడా సినిమా చేయాలని, అందుకు తగ్గ కథలు కూడా ఉన్నట్లు సందీప్ తెలిపారు. మరి నెక్స్ట్ చేయబోయే సినిమా అతనికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. సందీప్ ఆయ్

Tags:    
  • Sandeepraj 
  • Colorphoto 
  • Director 
  • Chandinirao 
  • Engagementceremony 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS