బయోపిక్స్ కోసం ఎదురు చూస్తోన్న హీరోయిన్
కేరళ కుట్టీ సంయుక్తా మీనన్ ప్రయాణం దేదీప్యమానంగా సాగిపోతుంది. దక్షిణాదిన అన్నిభాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.;
కేరళ కుట్టీ సంయుక్తా మీనన్ ప్రయాణం దేదీప్యమానంగా సాగిపోతుంది. దక్షిణాదిన అన్నిభాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం అంటూ ఏ భాషలో అవకాశం వచ్చినా కాదనకుండా పనిచేస్తోంది. గత ఏడాది తెలుగులో ఒక్క సినిమాతోనే అలరించినా కొత్త ఏడాదిలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతుంది. ప్రత్యేకించి అమ్మడి లైనప్ లో తెలుగు రిలీజ్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి కానుకగా 'నారీ నారీ నడుమ మురారీ' అంటూ యంగ్ హీరో శర్వాంద్ తో మెప్పించబోతుంది.
అనంతరం `స్వయంభూ`, పూరి జగన్నాద్ చిత్రంతో పాటు మరో సినిమాతో అలరించనుంది. కోలీవుడ్ లో `బెంజ్`, మాలీవుడ్ లో `రామ్`, బాలీవుడ్ లో `క్వీన్ ఆఫ్ క్వీన్స్ `చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇప్పటి వరకూ సంయుక్తా మీనన్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే కనిపించింది. గ్లామర్ పాత్రల్లో బోల్డ్ గా హైలైట్ అయ్యే ఛాన్స్ మాలీవుడ్ మినహా మరే భాషలోనూ తీసుకోలేదు. ఈ విషయంలో అమ్మడు ఎంతో తెలివైన గేమ్ ఆడి సక్సెస్ అయింది. ముందే బోల్డ్ అటెంప్ట్ కి ఒకే చేబితే తర్వాత ఆ పాత్రల్లో కిక్ ఉండదని భావించిన బ్యూటీ ఆ తరహా అవకాశాలు వచ్చిన వదులుకుంది.
వీలైనంత వరకూ పెర్పార్మెన్స్ ఓరియేంటెడ్ రోల్స్ తోనే మెప్పించింది. అయితే అమ్మడు సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం మరింత ప్రత్యేకంగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడప్పుడు కమర్శియల్ చిత్రాల్లో నటిస్తే ఎక్కు వగా బయోపిక్ కథలపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో కనిపిస్తోంది. జీవిత కథల్లో నటించడాన్ని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తోంది. ఇటీవలే యామీ గౌతమ్ నటించిన `హక్` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు సంయుక్తా మీనన్ ఎంతగా కనెక్ట్ అయిందంటే? ఏకంగా కన్నీళ్లే పెట్టేసుకుంది.
ప్లైట్ జర్నీలో `హక్` సినిమా చూస్తూ ఎవరూ గమనించకుకుండా ఎంతో ఏడ్చేసానంది. ఆ సినిమా తనకి ఎంతో స్పూర్తి వంతగా నిలిచిందంది. నిజ జీవిత కథలు, అహల్య బాయి వంటి శక్తి వంతమైన మహిళల పాత్రలు చేసే అవకాశం వస్తే ఏ మాత్రం మిస్ చేసుకోనంటోంది. నటిగా ఎన్ని సినిమాలు చేసినా వాస్తవ కథల్లో, జీవిత కథల్లో నటిస్తే ఆ నటి పూర్ణమవుతుందని అభిప్రాయపడింది.