ఆదిత్య‌ధ‌ర్ నేర్చుకున్న జీవిత స‌త్యం!

ఆదిత్య‌ధ‌ర్‌..ప్ర‌స్తుతం ఎవ‌రిని క‌దిలించినా వినిపిస్తున్న పేరిది. లిరిక్ రైట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆదిత్య‌ధ‌ర్ ఆ త‌రువాత డైలాగ్ రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.;

Update: 2026-03-13 06:38 GMT

ఆదిత్య‌ధ‌ర్‌..ప్ర‌స్తుతం ఎవ‌రిని క‌దిలించినా వినిపిస్తున్న పేరిది. లిరిక్ రైట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆదిత్య‌ధ‌ర్ ఆ త‌రువాత డైలాగ్ రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే త‌న‌కు `ఉరి:ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌` ద‌ర్శ‌కుడిగా అయ‌న్ని వైర‌ల్డ్ వైడ్‌గా పాపుల‌ర్‌ అయ్యేలా చేసింది. గ‌త ఏడాది విడుద‌లైన `ధురంధ‌ర్‌`తో ఇప్పుడు ఆదిత్య‌ధ‌ర్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. సామాన్య ప్రేక్ష‌కులే కాకుండా సెల‌బ్రిటీలు సైతం ఆదిత్య‌ధ‌ర్‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇండియ‌న్ సినిమా మేకింగ్‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డ‌మే కాకుండా స్పై యాక్ష‌న్ డ్రామాల‌కు స‌రికొత్త మేకింగ్‌ని నేర్పించాడు.




 


ప్ర‌స్తుతం `ధురంధ‌ర్‌`కు సీక్వెల్‌గా రానున్న `ధురంధ‌ర్ 2` రిలీజ్ ప‌నుల్లో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో `ధురంధ‌ర్ 2` రిలీజ్ కాబోతోంది. ఈ సారి సౌత్‌పై భారీ ఫోక‌స్ పెట్టిన మేక‌ర్స్ సౌత్ భాష‌లైన తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే పెయిడ్ ప్రీమియ‌ర్స్ బుకింగ్స్ ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ సంద‌ర్‌భంగా ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఫ‌స్ట్ పార్ట్‌ని సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్యావాదాలు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. కొంచెం సేపు విరామం తీసుకుని గ‌తేడాదిని ఒక్క‌సారి గుర్తు చేసుకుంటున్నా. ఈ రోజు ఆలోచిస్తుంటే నా మ‌న‌సు కృత‌జ్ఞ‌త‌తో నిండిపోతోంది. నా ప్ర‌యాణంలో ఎప్పుడూ నా వెన్నంటే న‌డిచిన నా టీమ్‌కు, ఇన్నేళ్లుగా నా ప‌నిపై ప్రేక్ష‌కులు చూపిన న‌మ్మ‌కానికి రుణ‌ప‌డి ఉంటాను. మీ మెసేజ్‌లు, పోస్ట్‌లు, స్టోరీలు..ముఖ్యంగా `పీక్ డీటైలింగ్ బై ఆదిత్య‌ధ‌ర్‌` మీమ్స్ చూస్తుంటే నా హృద‌యం నిండిపోతోంది. మీ అంద‌రికి వ్య‌క్తిగ‌తంగా స‌మాధానం చెప్పాల‌ని ఉన్నా అది కుద‌ర‌డం లేదు. మీ ప్రేమ‌కి, మీ ప్రోత్స‌హానికి నేను పొందే అనుభూతిని మాట‌ల్లో చెప్ప‌లేను` అన్నారు.

అంతే కాకుండా ఇండ‌స్ట్రీలో త‌ను తెలుసుకున్న జీవిత స‌త్యాన్ని ఈ సంద‌ర్భంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. నిజంగా అదృష్ట‌వంతుడిని. గ్యారెంటీలేని ఈ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి సినిమా ఒక సాహ‌స‌మే. ఇలాంటి చోట ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకోవ‌డం, నిల‌బెట్టుకోవ‌డం ఎంతో క‌ష్టం. నేను దాన్ని సాధించాను. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌రువాత నేను ఒక విష‌యం తెలుసుకున్నాను. మీ క‌ల‌లు ఎంత పెద్ద‌వైనా స‌రే వాటిపై న‌మ్మకం కోల్పోకండి. ప‌నిపై నిజాయితీగా ఉండండి. మీ స‌ర్వంస్వాన్ని ధార‌పోయండి.

అప్పుడు విశ్వం క‌చ్చితంగా స్పందిస్తుంది. మ‌నం వేసే ప్ర‌తి చిన్న అడుగు, మ‌న ప్ర‌తి పోరాటం మ‌న‌ల్ని ఉన్న‌త స్థాయిలో నిల‌బెడ‌తాయి` అని ఆస‌క్తిక‌రంగా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌. లిరిక్ రైట‌ర్ టు డైరెక్ట‌ర్‌గా ఎదిగిన ఆదిత్య‌ధ‌ర్ త‌న ప్ర‌యాణంలో ఎన్నో స‌వాళ్ల‌ని, ఎదురు దెబ్బ‌ల‌ని, అవ‌మానాల్ని ఎదుర్కొన్న‌ట్టుగా అత‌ని పోస్ట్‌లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎన్ని ఎదురుదెబ్బ‌లు ఎదురైనా న‌మ్మ‌కున్న ల‌క్ష్యంవైపు ప‌య‌నించాల‌ని, మ‌న సంక‌ల్పం గొప్ప‌దైతే విశ్వ‌మే మ‌న వెంట ఉండి న‌డిపిస్తుంద‌ని చెప్పిన తీరు ఆయ‌న ఎదుగుద‌ల‌కు అద్దంప‌డుతోంది.

Tags:    

Similar News