• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనంత్ ఒపీనియన్ మారినట్లు...

అనంత్ ఒపీనియన్ మారినట్లు లేదుగా..

| టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ లిరిసిస్ట్స్ లో అనంత శ్రీరామ్ ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By - M Prashanth
Update: 2026-03-13 06:42 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ లిరిసిస్ట్స్ లో అనంత శ్రీరామ్ ఒకరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆయన పద ప్రయోగాలు, లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. క్లాస్, మాస్, యూత్, రొమాంటిక్, టీజ్ సాంగ్.. ఇలా ఏ టైప్ పాట అయినా ప్రత్యేక శైలిలో రాయగలగడం ఆయన స్పెషాలిటీ.

పాటలు మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించిన విషయాలపై కూడా ఆయన అప్పుడప్పుడు తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వెల్లడిస్తుంటారు. అయితే కొంతకాలం క్రితం విడుదలైన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీలో మహాభారతంలోని కర్ణుడి పాత్రను అర్జునుడి కంటే గొప్పగా చూపించారని అప్పట్లో అనేక చర్చలు జరిగాయి. అదే విషయంపై అనంత శ్రీరామ్ కూడా ఘాటుగా స్పందించారు.

సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇతిహాసాలను వక్రీకరించడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం సభలో కూడా అనంత శ్రీరామ్ అదే విషయాన్ని ప్రస్తావించారు. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు కేవలం కథలు కాదని, అవి మన చరిత్రలో భాగమని ఆయన పేర్కొన్నారు.

ఆ ఇతిహాసాల్లోని పాత్రలు తెలిసిన విధంగా అర్థం చేసుకుని రాసుకున్నామని, వాటిని ఇష్టం వచ్చినట్లు మార్చే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ అంశంపై మరోసారి స్పందించిన అనంత శ్రీరామ్, తన పాత వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు కేవలం వినోదం కోసం చెప్పిన కథలు కావని తెలిపారు.

అవి మన సంస్కృతి, చరిత్రకు సంబంధించినవని, కమర్షియల్ హంగుల కోసం ఒక పాత్రను పూర్తిగా మార్చి చూపించడం సరైంది కాదని చెప్పారు. ముఖ్యంగా కొన్ని పాత్రలను గొప్పగా ఎలివేట్ చేస్తే అది అంగీకరించలేని విషయమని అన్నారు. ఇంకా మాట్లాడుతూ, గతంలో ఇలాంటి విషయాలు ప్రశ్నించే అవకాశం చాలా తక్కువగా ఉండేదని చెప్పారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి రావడంతో ప్రజలు కూడా తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అందుకే భవిష్యత్తులో కూడా ఎవరు పురాణాలను వక్రీకరించినా తాను అదే విధంగా స్పందిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కల్కిపై ఆయన ఒపీనియన్ మారలేదని చెప్పాలి. మొత్తానికి, తన అభిప్రాయాలను ఎలాంటి సందేహం లేకుండా ఓపెన్ గా చెప్పే అనంత శ్రీరామ్.. ఈసారి కూడా తన పాత వ్యాఖ్యలపైనే నిలబడుతూ మరోసారి చర్చకు కారణమయ్యారు.

Tags:    
  • anantasriram 
  • kalki2898 
  • mahbharata 
  • ramayana 
  • tollylyrics 
  • mythologydebate 
  • tollywoodnews 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS