విజయ్, త్రిష.. అర్జున్ పోస్ట్ వెనుక అర్ధమేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, సీనియర్ బ్యూటీ త్రిష.. రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.;
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, సీనియర్ బ్యూటీ త్రిష.. రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇద్దరూ కలిసి కనిపించిన కొన్ని సందర్భాలు వైరల్ కావడంతో వారి వ్యక్తిగత జీవితాలపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ నటుడు అర్జున్ దాస్ పెట్టిన ఒక క్రిప్టిక్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ కొత్త అనుమానాలకు తావిచ్చింది.
తమిళ సినిమాల్లో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ దాస్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషన్ తో కూడిన ఒక మెసేజ్ షేర్ చేశారు. "ఎవరినైనా ఎంతో ప్రేమిస్తే… చివరికి వాళ్లు మన హృదయాన్ని పగలగొడితే… అప్పుడు ఎలా ముందుకు సాగాలి?" అంటూ రాసుకొచ్చారు. అంతే కాకుండా.. దానికి హార్ట్ బ్రేక్ ఎమోజీని యాడ్ చేయడం గమనార్హం.
అయితే అర్జున్ దాస్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో ఆయన పోస్ట్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి అనే దానిపై చర్చ మొదలుపెట్టారు అనేక మంది నెటిజన్లు. ముఖ్యంగా ఇటీవల విజయ్, త్రిషల గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ పోస్ట్ ను చాలా మంది ఆ యాంగిల్ లో నరేట్ చేయడం ప్రారంభించారు.
ఇటీవల విజయ్, త్రిష కలిసి కనిపించిన కొన్ని సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువ సంబంధం ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అయితే ఆ వార్తలపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు ఎక్కడ.. ఎలాంటి విధంగా రెస్పాండ్ అవ్వలేదు. అయినప్పటికీ ఆ విషయం మాత్రం అభిమానుల మధ్య చర్చగా కొనసాగుతోంది.
దీంతో అర్జున్ దాస్ పెట్టిన భావోద్వేగ పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. కొందరు నెటిజన్లు ఆ పోస్ట్ ను విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో లింక్ చేస్తున్నారు. అర్జున్ దాస్ విజయ్ కు సన్నిహితంగా ఉండటంతో ఆయన ఆ విధంగా సిగ్నల్ గా స్పందించి ఉండొచ్చని వారు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఆ ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటివరకు అర్జున్ దాస్ తన పోస్ట్ కు అసలు కారణాన్ని వెల్లడించలేదు. దీంతో అభిమానులు మాత్రం దాని వెనుక ఉన్న నిజం ఏమిటి అన్న దానిపై ఇంకా డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్, త్రిషల గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్న సమయంలో అర్జున్ దాస్ చేసిన ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన డిబేట్ కు కారణమైంది. మరి ఆయన ఆ విషయంపై స్పష్టత ఇస్తేనే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.