13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైన ఎన్టీఆర్ హీరోయిన్.. వారి బలవంతమే అంటూ!

ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత తెరపై సమీరా రెడ్డిని చూడడంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.;

Update: 2025-08-12 14:30 GMT

ఎన్టీఆర్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న.. బాలీవుడ్ నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఈ హీరోయిన్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవా , జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు,అశోక్ వంటి సినిమాలు చేసింది. అయితే తెలుగులో ఈ హీరోయిన్ చేసిన సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో ఈమెను వేరే సినిమాల్లో పెట్టుకోవడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో ఈ హీరోయిన్ కి తెలుగులో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. అయితే అలాంటి సమీరా రెడ్డి దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది..అయితే రీ ఎంట్రీకి కారణం కూడా తన కొడుకు అంటూ తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. మరి సమీరారెడ్డి రీ ఎంట్రీకి తన కొడుకు ఎలా కారణమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా సంవత్సరాల తర్వాత సమీరా రెడ్డి చిమ్నీ అనే హార్రర్ ఫిల్మ్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒక పాత రాజ భవనంలో తన కూతుర్ని దుష్టశక్తి నుండి పోరాడే తల్లి పాత్రలో సమీరారెడ్డి కనిపించబోతోంది.అయితే 13 ఏళ్ల తర్వాత తాను సినీ సినిమాల్లోకి రీ ఎంట్రీ గురించి సమీరారెడ్డి మాట్లాడుతూ.. "నేను చివరిగా 2012లో తేజ్ అనే మూవీ చేశాను. ఆ తర్వాత కుటుంబం కోసం సినిమాలకు దూరంగా ఉన్నాను.. కానీ నా కొడుకు బలవంత పెట్టడం వల్లే మళ్లీ తిరిగి సినిమాల్లోకి వస్తున్నాను. 13 ఏళ్ల వయసులో నా కొడుకు నేను నటించిన రేస్ మూవీ చూసి అమ్మా మళ్లీ ఎందుకు నటించడం లేదు. మళ్లీ నువ్వు సినిమాల్లోకి వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టాడు.. కానీ నేను మాత్రం పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉండడం వల్లే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని నా కొడుకుకి చెప్పాను. కానీ ఇప్పుడు నా కొడుకు పెద్దయ్యాడు. అందుకే రీ ఎంట్రీకి ఇదే సరైన సమయమని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను.

ఇప్పుడు నేను సినిమాల్లోకి రావడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాననిపిస్తుంది. అందుకే రీ ఎంట్రీ ఇచ్చేసాను. రీ ఎంట్రీలో సెట్లో ఉన్న చాలా మంది నన్ను చూసి వెటరన్ అంటూ పిలిచేవారు. ఆ టైంలో నా లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాననిపించింది.. ఇక సెట్ లోకి వెళ్లడంతోనే డైరెక్టర్ యాక్షన్ అని చెప్పినప్పుడు నాలో ఏదో తెలియని ఫీలింగ్ మేల్కొన్నట్టు అనిపించేది.. చిమ్నీ సినిమా కోసం నేను నా శాయశక్తులా కృషి చేశాను" అంటూ తన రీఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సమీరా రెడ్డి.

ఇక సమీరా రెడ్డి చిమ్నీ మూవీ విషయానికొస్తే.. చిమ్నీ టీజర్ లో ఆమె చీకటిలో నడుస్తున్నట్టు, భయానకమైన సన్నివేశాలను ఎదుర్కొన్నట్టు చూపించారు. ఈ సినిమా కథ ఉత్కంఠత, భావోద్వేగంతో కూడి ఉన్నట్టు అర్థమవుతుంది.

ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత తెరపై సమీరా రెడ్డిని చూడడంతో ఆమె అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

సమీరా రెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే.. 2014న అక్షయ్ వర్దేని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2015లో ఓ బాబుకు జన్మనిచ్చింది. సమీరా రెడ్డి సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది. అలాగే తరచూ ఇంటర్వ్యూలు ఇస్తూ తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా బయట పెట్టింది.

Tags:    

Similar News