కథల వేటలో స్టార్ హీరోయిన్..?

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత ఎప్పటికప్పుడు తన స్పెషాలిటీ చాటుకుంటూ వస్తుంది

Update: 2024-04-29 04:09 GMT

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత ఎప్పటికప్పుడు తన స్పెషాలిటీ చాటుకుంటూ వస్తుంది. కెరీర్ లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాటిని చిరునవ్వుతో దాటుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. డైవర్స్ తర్వాత సమంత కెరీర్ పరంగా కాస్త వెనక పడుతుందని అనుకోగా దాని కన్నా ఆమెకు వచ్చిన మయోసైటిస్ వల్ల చాలా ఇబ్బందులు పడింది. యశోద, శాకుంతలం ఈ సినిమాలు సమంత మయోసైటిస్ తో బాధపడుతూనే నటించింది. సినిమా మీద ఆమెకున్న కమిట్మెంట్ ఎలాంటిదో ఆ సినిమాల టైం లో ఆమె ఎంత కష్టపడి చేసిందో తెలిసి ఆడియన్స్ షాక్ అయ్యారు.

లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత తన నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుంది. ఇక మీదట కెరీర్ ను సూపర్ స్పీడ్ లో కొనసాగించాలనే ఉద్దేశంతో సొంత బ్యానర్ పెట్టింది అమ్మడు. అంతేకాదు బర్త్ డే సందర్భంగా మా ఇంటి బంగారం అంటూ ఒక సినిమా అనౌన్స్ కూడా చేసింది.

తనకు ఛాలెంజింగ్ గా అనిపించే ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధం అంటున్న సమంత కమర్షియల్ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఈ క్రమంలో సమంత కథల వేటలో పడిందని టాక్. సమంత చేయాలనుకోవాలే కానీ ఆమె కోసం ఫిమేల్ సెంట్రిక్ కథలు రాసి క్యూ కడతారు.

Read more!

ఇదివరకు కథ తనకు నచ్చినా నిర్మాత కూడా ఓకే చేయాలన్న ట్విస్ట్ ఉండేది కానీ సొంతంగా బ్యానర్ పెట్టిన సమంత కథ తనకు నచ్చి వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తే చాలు కచ్చితంగా చేసేస్తుంది. సమంత బ్యానర్ లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది. సొంత బ్యానర్ లో డిఫరెంట్ అటెంప్ట్ తో సమంత తన సత్తా చాటాలని చూస్తుంది. సమంత తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆమె కెరీర్ కచ్చితంగా మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

మా ఇంటి బంగారం కథ ఏంటో తెలియదు కానీ తుపాకీతో సమంత ఈసారి బోల్డ్ అటెంప్ట్ చేసినట్టు అర్థమవుతుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేసేందుకు రెడీ అంటుంది సమంత. సిటాడెల్ వెబ్ సీరీస్ రిలీజ్ తర్వాత సమంత బాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News