• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎందుకు నీ భర్తను మోసం...

ఎందుకు నీ భర్తను మోసం చేశావ్.. సామ్ తెలివైన ఆన్సర్!

| అక్కినేని యువ హీరో నాగ చైతన్య, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకునే కొన్నేళ్ల తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-04-10 05:47 GMT

అక్కినేని యువ హీరో నాగ చైతన్య, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకునే కొన్నేళ్ల తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న అనంతరం ఎవరి జీవితంలో వారు చాలా సంతోషంగా గడుపుతున్నారు. అంతే కాకుండా విడిపోయినప్పుడు చాలా క్లారిటీగా ఒక వివరణ ఇచ్చిన ఈ జంట ఇద్దరు జీవితాలు కూడా బాగుండాలి అని మనస్పూర్తిగా నే కోరుకున్నారు.


ఒక విధంగా అది వారి వ్యక్తిగత విషయం. ఇందులో ఎవరు కూడా ప్రశ్నించాల్సిన హక్కు లేదు అనేలా ఫ్యాన్స్ నుంచి కూడా కొంత సపోర్ట్ అయితే లభించింది. ఇక వారి వ్యక్తిగత జీవితం పై ఎన్ని కామెంట్స్ వస్తున్నా కూడా ఈ జంట ఎప్పుడూ కూడా పెద్దగా స్పందించింది లేదు. ఇక సమంత మాత్రం అప్పుడప్పుడు తన భావాలను వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేస్తోంది.

సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే సమంత అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఆమె కూడా అంతే దీటుగా నెగిటివ్ కామెంట్ చేసే వారికి గట్టిగా కౌంటర్ అయితే ఇస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె ఒక పాడ్ క్యాస్ట్ వీడియో చేసినప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురయింది.

అమాయకుడైన నీ భర్త చైతన్యను ఎందుకు వదిలేసావు అనేలా ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. ఇక అందుకు సమంత చాలా ఓపికతో సరైన కౌంటర్ అయితే ఇచ్చింది. సారీ ఇలాంటి ఆచరణలు మీకు ఏ విధమైన సహాయం చేయలేవు.. మీకు అంతా మంచి జరగాలి.. బలంగా మారాలి అని కోరుకుంటున్నాను అనేలా ఆమె వివరణ ఇచ్చారు.

సమంత ఇచ్చిన వివరణలో, మనకు అవసరం లేని మరొకరి వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించకూడదు అని ఆమె చెప్పకనే చెప్పేసింది. అంతేకాకుండా మీ జీవితంలో గురించి మీరే ఆలోచించుకోవాలి అని ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేంత తక్కువ మనసుతో ఉండకూడదు అని ఆమె తన భావాన్ని వ్యక్తపరిచినట్లుగా అర్థమవుతుంది.

సమంత తన విడాకుల విషయం గురించి ఇతరులతో చర్చించడానికి ఏమాత్రం ఇష్ట పడడం లేదు అని మరోసారి క్లారిటీగా తెలియజేసినట్లు చెప్పవచ్చు. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా ఈ విధంగా కామెంట్ చేసేవారు ఆలోచిస్తే మంచిదని మరికొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమంత ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే.

Tags:    
  • Netizens 
  • Socialmedia 
  • Samantha 
  • Actress 
  • Nagachaitanya 
  • Divorce 
  • Filmindustry 
  • Citadel 
  • Thandel 
  • Podcast 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS