మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సమంత.. జోరు పెంచిందిగా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కలెక్షన్స్ ఫోటోలను పంచుకుంటూ.. "కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది.;

Update: 2025-11-11 13:36 GMT

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి బిజినెస్ లు కూడా చేస్తున్నారు. అందులో కొంతమంది సొంతంగా వ్యాపారాలు మొదలుపెడితే.. మరి కొంతమంది పలు బ్రాండ్ ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు సమంత మాత్రం జోరు పెంచేసింది అని చెప్పాలి. ఇప్పటికి పెర్ఫ్యూమ్, బట్టల బ్రాండ్లను ఓపెన్ చేసి బిజినెస్ ఉమెన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని కూడా షేర్ చేసింది సమంత.

ఫ్యాషన్ నుండి వెల్నెస్ వరకు.. విద్య నుండి సూపర్ ఫుడ్స్ వరకు సమంత ప్రతిదానిలో కూడా తన దృష్టిని సారించి, తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. అయితే అలాంటి ఈమె ఇప్పుడు మరో కొత్త లగ్జరీ దుస్తుల బ్రాండ్ తో తిరిగి వచ్చేసింది. ఇప్పటికే 2020లో సాకీ అనే దుస్తుల బ్రాండ్ ను స్థాపించడమే కాకుండా వినూత్నమైన ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు TRULY SMA అనే పేరుతో మరో కొత్త బ్రాండ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కలెక్షన్స్ ఫోటోలను పంచుకుంటూ.. "కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. నిజంగా SMA ఇప్పుడు ప్రత్యక్షమైంది.. కచ్చితంగా ఈ దుస్తులు మీకు రెండవ చర్మంలా అనిపిస్తాయి" అంటూ తెలిపింది. ఇకపోతే ఈమె స్వయంగా సహ స్థాపించిన ఈ బ్రాండ్ దుస్తులు సులభంగా ధరించగలిగేదిగా స్టైలిష్ గా ఉండే సులభమైన లగ్జరీని అందిస్తాయని వాగ్దానం చేస్తోంది. అభిమానులు ఈ బ్రాండ్ దుస్తులు కొనుగోలు చేయడం కోసం www.trulysma.comలో కలెక్షన్లను అన్వేషించవచ్చు అని కూడా స్పష్టం చేసింది సమంత. మొత్తానికి అయితే మరో లగ్జరీ దుస్తుల బ్రాండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

నిర్మాతగా కూడా సమంత గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధి కారణంగా అలాగే తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈమె అన్నింటి నుంచి తేరుకొని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది సమంత. అలా శుభం అనే సినిమాను మొదటిసారి నిర్మించి మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో మాయా అనే పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా నిర్మిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు సమంత ఇందులో లీడ్ రోల్ పోషిస్తూ ఉండడం గమనార్హం.

మరోవైపు బాలీవుడ్ రాజ్ & డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ కూడా ఆగిపోయింది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది త్వరలో పూర్తి చేస్తామని కూడా మేకర్స్ హామీ ఇచ్చారు..


Tags:    

Similar News