సమంత, రష్మికలకు పెళ్లి తర్వాత అగ్నిపరీక్ష!
సమంత `మా ఇంటి బంగారం`, రష్మిక `కాక్టైల్ 2` చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి.
చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ పెళ్లి తర్వాత మారడం సహజం. ఒకప్పుడు వివాహం తర్వాత కథానాయికలు గ్లామర్ రంగానికి, సినిమాలకు దూరం జరిగేవారు. కానీ ప్రస్తుత తరం తారలు పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతూ సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోయిన్లు సమంత, రష్మిక మందన్నలకు అత్యంత కీలకమైన అగ్నిపరీక్ష ఎదురు కాబోతోంది. పెళ్లి తర్వాత ఇద్దరు నటించిన చిత్రాలు ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
టాలెంటెడ్ నటి సమంత సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఆమె తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `మా ఇంటి బంగారం` సినిమాతో ఈ వారం థియేటర్లలోకి వస్తోంది. సమంతకు అత్యంత సన్నిహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సమంత భర్త రాజు నిడిమోరు పవర్‌ఫుల్ కథను అందించడం విశేషం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక సమంత నటిస్తున్న మొదటి సినిమా కావడం, పైగా హోమ్ బ్యానర్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
గతంలో సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన `ఓ బేబీ` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ భర్త రాసిన వైవిధ్యభరితమైన కథతో సమంత ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో బిజినెస్ వర్గాల్లో సినిమా సేఫ్ జోన్ లో ఉన్నట్లేనని భావిస్తున్నారు. అయితే మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా కావడం - పెళ్లి తర్వాత ప్రేక్షకులు ఆమెను స్క్రీన్‌పై ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది సమంత కెరీర్ భవిష్యత్తుకు కీలకంగా మారనుంది.
మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా పెళ్లి తర్వాత బాలీవుడ్ మార్కెట్‌ను పదిలపరుచుకునేందుకు సరికొత్త గ్లామర్ అవతారంతో సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ హిందీ చిత్రం `కాక్టైల్ 2` జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మికకు, పెళ్లి తర్వాత థియేటర్లలోకి వస్తున్న మొదటి హిందీ ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం.
ఈ `కాక్టైల్ 2` చిత్రంలో రష్మిక అల్ట్రా గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్ ద్వారా స్పష్టమైంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కాస్త డీగ్లామరైజ్డ్ లేదా హోమ్లీ పాత్రల వైపు మొగ్గు చూపుతారనే అంచనాలను బ్రేక్ చేస్తూ రష్మిక గ్లామర్ డోస్‌ను మరింత పెంచడం విశేషం. నార్త్ ఆడియన్స్ లో తనకున్న క్రేజ్‌ను అలాగే కాపాడుకుంటూ, పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్‌లో టాప్ లీగ్‌లో కొనసాగడానికి ఈ సినిమా విజయం రష్మికకు ఎంతో అవసరం.
సమంత `మా ఇంటి బంగారం`, రష్మిక `కాక్టైల్ 2` చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి. పెళ్లి అనేది హీరోయిన్ల స్టార్‌డమ్‌కు ఎండ్ కార్డ్ కాదని.. కేవలం ఒక కొత్త ఇన్నింగ్స్ మాత్రమేనని నిరూపించడానికి ఇద్దరు భామలకు ఇదొక సువర్ణావకాశం. వైవిధ్యమైన లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్న సమంత, కమర్షియల్ గ్లామర్ బొమ్మతో వస్తున్న రష్మిక ఇద్దరిలో ఈ వారం బాక్సాఫీస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారో, పెళ్లి తర్వాత వీరి సెకండ్ ఇన్నింగ్స్ ఎలాంటి? మలుపు తిరుగుతుందో చూడాలి.