• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిటాడెల్ పార్టీ.....

సిటాడెల్ పార్టీ.. లేటెస్ట్ సాంగ్ కు సామ్ డ్యాన్స్ అదుర్స్!

| స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-29 07:01 GMT

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్ర పోషించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సిటాడెల్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి టాప్ లో కొనసాగుతోంది.

అత్యధిక వ్యూస్ ను దక్కించుకుని సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో సిరీస్ ప్రసారమతుండగా.. 150 దేశాల్లో టాప్‌ లో నిలిచి ఇప్పటికే ఓ రికార్డు క్రియేట్ చేసింది. అదే సమయంలో సామ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

నార్మల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ల్లో సమంత అదరగొట్టేశారని అనేక మంది కొనియాడారు. హనీ పాత్రలో ఒదిగిపోయారని రివ్యూస్ ఇచ్చారు. అయితే తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ టీమ్.. సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సామ్, వరుణ్ సహా టీమ్ అంతా అటెండ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేసింది.

ముంబైలో నిన్న రాత్రి జరిగిన సిటాడెల్ సక్సెస్ పార్టీకి సంబంధించిన పిక్స్ ను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందమైన వ్యక్తులు.. అందమైన సాయంత్రం.. నా మనసంతా ఆనందంతో నిండిపోయిందని క్యాప్షన్ ఇచ్చారు. వాటికి వరుణ్ ధావన్ స్పందించారు. ఎప్పటికీ ది బెస్ట్ కోస్టార్ అంటూ కొనియాడారు.

అదే సమయంలో సమంత, వరుణ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన నైన్ మటక్కాకు ఇద్దరూ డ్యాన్స్ చేశారు. ఇప్పటికే అందరినీ అలరిస్తున్న ఆ సాంగ్ కు హుక్ స్టెప్స్ వేసి అలరించారు సామ్, వరుణ్.

దీంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. సమంత ఎనర్జీ సూపర్బ్ అని కొనియాడుతున్నారు. ఎవర్ గ్రీన్ సామ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా సామ్, వరుణ్ డ్యాన్స్ వీడియో షేర్ చేసి అభినందిస్తున్నారు. మరి నైన్ మటక్కా సాంగ్ కు సిటాడెల్ జోడీ వేసిన స్టెప్స్ చూశారా?

varun and samantha dancing on nain matakka song, damn i’m obsessed 😭🔥 pic.twitter.com/NW65HBPxN9

— Annesha (@ApnaaVarun) November 28, 2024
Tags:    
  • Samantha 
  • Citadelhoneybunny 
  • Varundhawan 
  • Bollywood 
  • Rajanddk 
  • Filmindustry 
  • Citadel 
  • Samantharuthprabhu 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS