సలార్ 2 రోజుల కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే?

ప్రభాస్ సలార్ సినిమా మొదటిరోజు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ అయితే అందుకుంది.;

Update: 2023-12-24 10:10 GMT

ప్రభాస్ సలార్ సినిమా మొదటిరోజు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ అయితే అందుకుంది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసాయి. బాహుబలి అనంతరం సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి సలార్ తో అర్థమయిపోయింది. పర్ఫెక్ట్ టైమ్ లో పర్ఫెక్ట్ కాంబినేషన్ సినిమా పడడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.


అయితే మొదటి రోజు సినిమాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 50.29 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాగా రెండో రోజు మాత్రం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా రెండవ రోజు కేవలం 21 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం రెండు రోజుల్లో 71 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఏపీ తెలంగాణలో 2 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం: 33.60 కోట్లు

సీడెడ్: 9.45CR

ఉత్తరాంధ్ర: 7.04Cr

ఈస్ట్: 5.90Cr

వెస్ట్: 3.87Cr

గుంటూరు: 5.60 కోట్లు

కృష్ణ: 3.53 కోట్లు

నెల్లూరు: 2.53 కోట్లు

AP-TG మొత్తం:- 71.52 కోట్లు షేర్, 104.65 కోట్లు గ్రాస్

కర్ణాటక: 9.65 కోట్లు

తమిళనాడు: 4.45 కోట్లు

కేరళ: 3.20 కోట్లు

హిందీ+ROI: 19.25Cr

ఓవర్సీస్ - 35.20Cr**

మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు: 143.27 కోట్లు(గ్రాస్- 251.15CR)

అయితే ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 251 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 295.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. రెండవ రోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి కానీ మొదటి రోజు కంటే చాలా వరకు తగ్గాయి

ఇక ఆదివారం రోజు కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన ఓవరాల్ బిజినెస్ 345 కోట్లు అంటే 347 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం రెండు రోజుల్లో 143 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రాఫిట్ లోకి రావాలి అంటే సినిమా ఇంకా 203 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

Similar News