మార్కెట్ వాల్యూ ఉంటేనే భార్యపై సానుభూతా

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ హాట్ టాపికే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- ఆయన భార్య సంగీత విడాకుల వార్తలు కొన్ని రోజులుగా చ‌ర్చ‌లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-27 04:08 GMT

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ హాట్ టాపికే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- ఆయన భార్య సంగీత విడాకుల వార్తలు కొన్ని రోజులుగా చ‌ర్చ‌లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. నటి త్రిషతో ముడిపెడుతూ వ‌స్తోన్న కథనాలు సౌత్ ఇండియాలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదం కాస్తా ఇప్పుడు భార్యల గౌరవం , సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై చర్చకు దారితీస్తోంది. తాజాగా నటుడు జయం రవి మాజీ భార్య ఆర్తి రవి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే ఆమె సమాజంలోని వివక్షను ప్రశ్నించారు.

'ఒక భార్య పడే వేదనపై సానుభూతి చూపడం అనేది ఆమె భర్తకు ఉన్న మార్కెట్ వాల్యూ లేదా రాజకీయ బలంపై ఆధారపడి ఉంటుందా? అంటూ ఆమె వేసిన ప్రశ్నలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. గత ఏడాది రవి మోహన్ తనతో విడిపోయి మరో మహిళతో బహిరంగంగా కనిపించినప్పుడు తనపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ వచ్చిందని ఆర్తి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు విజయ్ విషయంలో మాత్రం భార్య సంగీతకు అందరూ మద్దతుగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. శక్తివంతులైన భర్తలు ఉన్నప్పుడే భార్యల బాధ అందరికీ కనిపిస్తుందా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్ ఇటీవల రాజకీయ పార్టీ స్థాపించిన నేపథ్యంలో పొలిటికల్ పవర్ అనే పదాన్ని ఆమె వాడటం గమనార్హం. విజయ్ - త్రిష ఒకే రకమైన దుస్తులు ధరించి ఒక బహిరంగ కార్యక్రమంలో కనిపించడం వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి బలాన్ని ఇచ్చింది. దీనివల్ల సంగీత విడాకులకు దరఖాస్తు చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. ఒక స్టార్ హీరోగా కాబోయే రాజకీయ నాయకుడిగా విజయ్ ఇమేజ్‌ను ఈ వివాదం దెబ్బతీస్తుందనే ఆందోళన ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది. అందుకే ఈ విషయంలో సంగీతకు పెద్ద ఎత్తున సానుభూతి లభిస్తోంది.

మొత్తానికి ఆర్తి రవి చేసిన వ్యాఖ్య‌లు సెలబ్రిటీల జీవితాల్లో మ‌రో కోణాన్ని హైలైట్ చేస్తున్నాయి. సానుభూతి అనేది కేవలం హోదాను బట్టి కాకుండా బాధలో ఉన్న ప్రతి మహిళకు సమానంగా అందాలని ఆమె ఆకాంక్షించారు. ఒక స్టార్ హీరో భార్య పడే బాధ ఎంత నిజమో? సామాన్య వ్యక్తి భార్య పడే వేదన కూడా అంతే నిజమని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలు పులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ విష‌యంలో ఇప్ప‌టికే విజ‌య్-త్రిష‌లు స్పందించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News