శోభన్ బాబులా భూమిని నమ్ముకుని 100కోట్లు ఆర్జించిన నటుడు!
భారతీయ చలనచిత్ర రంగంలో చాక్లెట్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి.. నేడు వెర్సటైల్ యాక్టర్‌గా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ఆర్. మాధవన్ (మ్యాడీ).;
భారతీయ చలనచిత్ర రంగంలో చాక్లెట్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి.. నేడు వెర్సటైల్ యాక్టర్‌గా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ఆర్. మాధవన్ (మ్యాడీ). కేవలం నటనలోనే కాకుండా సంపాదన నిర్వహణలోనూ ఆయనది అందెవేసిన చేయి. 2026 నాటికి ఆయన నికర ఆస్తి విలువ సుమారు 115 కోట్ల నుండి 125 కోట్ల రూపాయలకు చేరుకుందని అంచనా. తన తాతగారు ఇచ్చిన `డబ్బు రాగానే భూమిపై పెట్టుబడి పెట్టాలి` అనే సలహాను తూచా తప్పకుండా పాటిస్తూ.. మాధవన్ తన సంపాదనను చాలా తెలివిగా రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లించి నేడు ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
మాధవన్ నివాసాల విషయానికి వస్తే.. ముంబై , చెన్నైలలో అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న `సిగ్నియా పర్ల్`లో 17.5 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఉంది. 4,182 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ప్రస్తుతం నెలకు దాదాపు 6.5 లక్షల అద్దె ఆదాయాన్ని అందిస్తోంది. దీనికి తోడు తన స్వస్థలం చెన్నైలో సుమారు రూ.18 కోట్ల విలువైన బంగ్లా ఉంది. ఇది సంప్రదాయ తమిళ శైలి ఆధునిక హంగుల కలయికతో చూడముచ్చటగా ఉంటుంది. అలాగే ముంబైలోని జుహూ ప్రాంతంలో కూడా మ్యాడీకి మరో అందమైన ఇల్లు ఉంది.
మాధవన్ జీవనశైలిలో మరో ఆసక్తికరమైన అంశం ఆయనకున్న `హైడ్రోపోనిక్స్` తోట.. అంతర్జాతీయ నివాసాలు ఒక భాగం. ముంబై ఇంటి టెర్రస్ మీద మట్టి లేకుండా మొక్కలు పెంచే ఆధునిక పద్ధతిలో ఆయన సేంద్రీయ కూరగాయలు పండిస్తుంటారు. తన కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ శిక్షణ కోసం దుబాయ్‌కు మారిన సమయంలో అక్కడ కూడా ఒక విలాసవంతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన సొంత యాచ్ (పడవ) కూడా ఉంది. విశేషమేమిటంటే లాక్‌డౌన్ సమయంలో మాధవన్ ప్రత్యేకంగా స్టడీ చేసి `నౌకను నడిపే కెప్టెన్ లైసెన్స్` కూడా పొందడం అతడి పట్టుదలకు చిహ్నం.
మాధవన్‌కు వాహనాలంటే మక్కువ ఎక్కువ. తన గ్యారేజీలో మెర్సిడెస్ బెంచ్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్లు కొలువై ఉన్నాయి. కార్ల కంటే అతడికి సూపర్ బైక్స్ అంటే ప్రాణం. దాదాపు 26 లక్షల విలువైన బీఎండబ్ల్యూ R1300 జీఎస్ అడ్వెంచర్ బైక్‌తో పాటు ఇండియన్ రోడ్‌మాస్టర్, యమహా వీ-మాక్స్, హోండా గోల్డ్‌వింగ్ వంటి అరుదైన మోడల్స్ తన వద్ద ఉన్నాయి. ఇలా కోట్లలో విలాసవంతమైన వస్తువులు ఉన్నా.. అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుగా ఉండటమే తన విజయరహస్యమని ఆయన తరచుగా చెబుతుంటారు.
ప్రస్తుతం మాధవన్ ఒక్కో సినిమాకు రూ.6 నుండి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆయన భారీగా గడిస్తున్నారు. మధ్యతరగతి మనస్తత్వంతో క్రమశిక్షణగా పొదుపు చేస్తూ.. రియల్ ఎస్టేట్ వంటి సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టడం వల్లే ఆయన నేడు ఇంతటి నికర ఆస్తిని ఆర్జించారు. నటనలో రాణిస్తూనే.. పక్కా ప్లానింగ్‌తో ఆస్తులను ఎలా పెంచుకోవాలో చెప్పడానికి మాధవన్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ. శోభన్ బాబు లా భూమిపై పెట్టుబడులు పెట్టి ఎదగాలనే విషయం చాలా మంది ఆర్టిస్టులకు తెలుసు. కానీ ఆచరణలో చేసి చూపించారు మ్యాడీ.