ఎన్టీఆర్ తో ఆ సినిమా చేద్దామ‌నుకున్నా.. కానీ?

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా చుట్టూ పలు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.;

Update: 2026-03-26 23:30 GMT

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా చుట్టూ పలు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ సీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమాలో ఆయన మొదట జీప్ నుంచి దిగడం, తర్వాత మళ్లీ జీప్ నుంచి జంప్ చేస్తూ దిగడం చూసిన నెటిజన్స్ ఇదేం లాజిక్ అంటూ ట్రోల్స్ చేశారు. ఈ సీన్‌పై మీమ్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.

ప‌వ‌న్ ఎంట్రీ సినిమాటిక్ లిబ‌ర్టీనే అని క్లారిటీ

ఈ విమర్శలపై డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ స్పందిస్తూ తన స్టైల్‌ను క్లారిటీ చ్చారు. కొన్ని సందర్భాల్లో లాజిక్ కంటే విజువల్ ఫీల్ ముఖ్య‌మ‌ని, త‌న‌కు నచ్చిన షాట్స్‌ను సినిమాలో ఉంచుతానంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ రెండింటిలో ఒక షాట్ ను తానే తీశానని, మరొకటి ఫైట్ మాస్టర్ తీసారని, రెండూ బాగుండటంతో ఫైనల్ కట్‌లో పెట్టినట్టు తెలిపారు. ఇది పూర్తిగా సినిమాటిక్ లిబర్టీ అని ఆయన చెప్పడం గమనార్హం. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవ‌డానికి ఇలాంటి ఎలిమెంట్స్ అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్నో ఏళ్ల‌వుతున్నా చేసింది 9 సినిమాలే!

ఇక హరీష్ శంకర్ కెరీర్ విషయానికి వస్తే, ఆయ‌న ఇండస్ట్రీకి వ‌చ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఆయన చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పటివరకు కేవలం 9 సినిమాలే తెరకెక్కించానని, దాదాపు 10 ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని ఆయన వెల్లడించారు. ఆ సినిమాలపై వర్క్ చేసినప్పటికీ అవి పట్టాలెక్కకపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ శంక‌ర్ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఎంఎల్ఏ అనే ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేసినట్టు హరీష్ వెల్లడించారు. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోని కారణాలతో ఆగిపోయిందని చెప్పారు. గ‌తంలో వారిద్ద‌రూ చేసిన రామ‌య్యా వస్తావ‌య్యా ఫ్లాప్ అవ‌గా, త‌ర్వాత తార‌క్ ఛాన్స్ ఇస్తే త‌న‌కు హిట్ ఇవ్వాల‌ని కోరిక ఉన్న‌ట్టు హ‌రీష్ ప‌లుమార్లు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ అప్పుడే మెటీరియ‌లైజ్ కాలేకపోయినా, ఫ్యూచ‌ర్‌లో వీరిద్ద‌రూ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఇంకా ఉంది.

ఇక‌పై గ్యాప్ ఇవ్వ‌ను

ఇకపై వ‌రుస పెట్టి సినిమాలు చేస్తాన‌ని, సినిమాల విష‌యంలో ఎలాంటి ఆల‌స్యం చేయ‌న‌ని, ఆల్రెడీ తన వద్ద చాలానే కథలు సిద్ధంగా ఉన్నాయని, ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై హైప్ పెరిగింది. అంతేకాదు, ఆయన వ్యక్తిగతంగా చెప్పిన మాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. మనమంతా మూవీ లవర్స్ అని, ఏ సినిమా హిట్ అయినా సంతోషమేన‌ని, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తో పాటూ రిలీజైన ధురంధ‌ర్2 బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను తెచ్చుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

Tags:    

Similar News