అన్నీ రెడీ! ప‌వ‌న్ ఓకే అన‌డ‌మే ఆల‌స్యం..

ఇప్పటికే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ అవ‌గా, ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.;

Update: 2026-03-27 00:30 GMT

టాలీవుడ్‌లో పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల ఆయన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు అన్నదానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ అవ‌గా, ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

2023లో రిలీజైన బ్రో

ఇక మరోవైపు అభిమానులైతే ఓజి సినిమా సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ అంచనాల మధ్య ఊహించని విధంగా మరో ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అదే బ్రో2 . 2023లో రిలీజైన బ్రో సినిమా ఫాంటసీ కామెడీ జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స‌ముద్రఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు ప‌వ‌న్ మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో పవన్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని సాధించినప్పటికీ, అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.

బ్రో2 పై స‌ముద్ర‌ఖ‌ని కామెంట్స్

ఇలాంటి సమయంలో బ్రో2 మూవీపై డైరెక్ట‌ర్ సముద్రఖని చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బ్రో2 స్క్రిప్ట్ రెడీగా ఉంద‌ని, ఆ ప్రాజెక్టు కోసం అన్నీ సిద్ధంగాఉన్నాయ‌ని, సినిమాను స్టార్ట్ చేయ‌డానికి అన్న ప‌వ‌న్ కళ్యాణ్ గారి గ్రీన్ సిగ్నల్ కోసం మాత్రమే వేచి చూస్తున్నామంటూ ఆయన చేసిన స్టేట్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వ‌చ్చేలా చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు, ఇప్పటికే కమిట్ అయిన సినిమాల‌ను క‌లిపి చూసుకుంటే బ్రో2 ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నేది ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా పవన్- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే, ఫ్యాన్స్‌కు అది పెద్ద ట్రీట్‌గా మారే అవకాశముంది. మొత్తానికి బ్రో2 ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా త్వరలోనే ఆఫీషియల్‌గా అనౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News