డెబ్యూల సినిమా 'పుష్ప' అంత పెద్ద హిట్టు!

నేటిత‌రం న‌టీన‌టులు అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా జంట‌గా న‌టించిన ఈ సినిమాకి మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.;

Update: 2025-07-27 05:38 GMT

ఎవ‌రు చెప్పారు భారీ మాస్ యాక్ష‌న్ చిత్రాలను మాత్ర‌మే థియేట‌ర్ల‌లో ఆద‌రిస్తార‌ని? ఎవ‌రు చెప్పారు పెద్ద స్టార్లు న‌టిస్తేనే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారని? ఎవ‌రు చెప్పారు హిందీ సినిమాల‌ను ఇత‌రులు థియేట‌ర్ల‌లో ఆద‌రించ‌రు అని?

అన్ని సందేహాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ ఒక రొమాంటిక్ ల‌వ్ స్టోరి ప్రభంజ‌నం సృష్టిస్తోంది. ఇది కేవ‌లం ఉత్త‌రాది బెల్ట్ లోనే కాదు, ఇటు ద‌క్షిణాదినా మ‌ల్టీప్లెక్సుల్లో విశేష ఆద‌ర‌ణ అందుకుంటూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ట్రేడ్ లెక్క‌ల ప్ర‌కారం.. ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా రెండో శుక్ర‌వారం, వారాంతంలో కూడా దుమ్ము రేపుతోంది. శ‌నివారం నాటికి ఈ చిత్రం 200 కోట్లు వ‌సూలు చేయ‌బోతోంది. ఇంత‌కీ ఇది ఏ సినిమా? అంటే.. ఇటీవ‌ల జ‌నాల్లో ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో ఉన్న `సైయారా` గురించే ఇదంతా.

నేటిత‌రం న‌టీన‌టులు అహాన్ పాండే, అనీత్ ప‌ద్దా జంట‌గా న‌టించిన ఈ సినిమాకి మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ డ్రామాల స్పెష‌లిస్ట్ మోహిత్ సూరి మ‌రోసారి త‌న‌దైన మ్యాజిక్ చేసారు. సైయారా ఈ శుక్ర‌వారం దాదాపు రూ. 18 కోట్లు వ‌సూలు చేసింఇ. ప్ర‌స్తుతం రూ. 193.25 కోట్లతో స్ట‌డీగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి వ‌సూళ్ల‌తో 200 కోట్లు అధిగ‌మించి ఇది మ‌రో వారంలో 300 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. సైయారా దూకుడు ఆ రేంజులో ఉందన్న చ‌ర్చ కొన‌సాగుతోంది.

ఈ ఏడాదిలో బాలీవుడ్ నుంచి `చావా` నంబ‌ర్ వ‌న్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 600 కోట్లు వ‌సూలు చేయ‌గా, రెండో అత్య‌ధిక వ‌సూళ్ల సినిమాగా `సైయారా` నిలిచింది. అత్యధిక రెండవ శుక్రవారం వసూళ్లు సాధించిన గ్రేట్ మూవీగాను సైయారా రికార్డుల‌కెక్కింది. ఇది అక్ష‌య్ కుమార్ హౌస్ ఫుల్ 5 రికార్డుని కూడా బ్రేక్ చేసింది.

రెండవ శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాను పరిశీలిస్తే, పుష్ప 2 (హిందీ): రూ. 27.50 కోట్లు, చావా: రూ. 24.03 కోట్లు, యానిమ‌ల్ : రూ. 23.53 కోట్లు, గ‌దర్ 2: రూ. 20.50 కోట్లు, బాహుబలి 2 (హిందీ): రూ. 19.75 కోట్లు స్త్రీ 2: రూ. 19.30 కోట్లు, జవాన్: రూ. 19.10 కోట్లు, దంగల్: రూ. 18.59 కోట్లు వ‌సూలు చేయ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో సైయారా: రూ. 18 కోట్లతో లీడ్ లో ఉంది. మ‌రో అగ్ర హీరో అమీర్ ఖాన్ న‌టించిన పీకే: రూ. 14.48 కోట్లు, షారూఖ్ న‌టించిన పఠాన్: రూ. 14 కోట్లు, రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన కేజీఎఫ్ 2 (హిందీ): రూ. 11.56 కోట్లు వ‌సూలు చేసాయి.

సైయారా ఈ ఆదివారం వ‌సూళ్ల‌తో క‌లుపుకుంటే 240 కోట్ల మార్కును అధిగ‌మిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మే అయినా సైయారా చిత్రం పుష్ప -1 రేంజు వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా. పుష్ప చిత్రం లైఫ్ టైమ్ 350కోట్లు సుమారుగా వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. పుష్ప 2 చిత్రం సుమారు 1500 కోట్లు వ‌సూలు చేసింది.

Tags:    

Similar News