• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తండేల్‌.. సాయి పల్లవిపై...

తండేల్‌.. సాయి పల్లవిపై పెద్ద బాధ్యతే!

| అమరన్ విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆ మూవీతో ఓ రేంజ్ లో అలరిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-11-07 09:30 GMT

నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పనక్కరలేదేమో! అందం, అభినయంతో ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా తనకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. తన మూవీ సెలక్షన్ విషయంలో కుండబద్దలు కొట్టేలా మేకర్స్ కు చెప్పేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమరన్ విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆ మూవీతో ఓ రేంజ్ లో అలరిస్తున్నారు.

దివంగత మేజర్ ముకుంద వరద రాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన అమరన్ లో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ పోషించారు. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి యాక్ట్ చేశారు. తన పాత్రలో ఒదిగిపోయి.. థియేటర్స్ కు వచ్చిన ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తున్నారు. అదే సమయంలో మూవీకి క్రౌడ్ పుల్లర్ గా మారారు. సినీ ప్రియులను రిపీటెడ్ మోడ్ లో రప్పిస్తున్నారు.

శివ కార్తికేయన్ కు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండడంతో అక్కడ అమరన్ భారీ కలెక్షన్స్ సాధించడం కామనే. కానీ తెలుగులో మాత్రం సాయి పల్లవి మూవీగానే అంతా ట్రీట్ చేస్తున్నారు. సినిమాను ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు. ఓ విషయంలో బాయ్ కాట్ సాయిప‌ల్ల‌వి అంటూ ట్రెండ్ చేసినవాళ్ళే ఇప్పుడు ఆమెను కొనియాడుతున్నారు. అదే సమయంలో సాయి పల్లవి.. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ, టాలీవుడ్ లో తండేల్‌ చిత్రాలు చేస్తున్నారు.

ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్‌ లో సాయి పల్లవి అచ్చ పల్లెటూరి అమ్మాయి రోల్ లో నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. సాయిపల్లవి మరోసారి తన పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపించారు. దీంతో మూవీ టీమ్.. ఆమెపై గట్టి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్.. సాయి పల్లవి కోసం స్పెషల్ గా మాట్లాడారు. తన స్పీచ్ లో అనేక సార్లు ఆమె పేరును ప్రస్తావించారు. దాంతోపాటు డైరెక్టర్ చందూ మొండేటి సాయి పల్లవి రోల్ ను స్పెషల్ గా తీర్చిదిద్దినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీంతో నాగచైతన్యపైనే కాదు.. సాయి పల్లవిపై కూడా మేకర్స్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల బాధ్యత వేసినట్లు తెలుస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Thandelmovie 
  • Nagachaitanya 
  • Saipallavi 
  • Chandoomondeti 
  • Amaranmovie 
  • Filmindustry 
  • Actresssaipallavi 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS