పల్లవి ముందు సాయి ఆయన దీవెనతోనే!
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా;
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు దేశ వ్యాప్తంగా ఉన్నభక్తులంతా హాజరవుతున్నారు. అలాగే పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు కూడా బాబాను దర్శించుకుంటున్నారు. బాబాబకు నటి సాయి పల్లవి కూడా గొప్ప భక్తురాలు అన్న సంగతి తెలిసిందే. ఏడాది ఆరంభంలో నూతన సంవత్సరం సందర్భంగా బాబాను దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి పుట్టపర్తికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు చీరలో సంప్రదాయంగా ముస్తాబయ్యారు.
బాబా నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. తాజాగా వేడుకలు సందర్భంగా సాయి పల్లవి బాబాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మ , తాతయ్యలు బాబాకు పరమ భక్తులన్నారు. పుట్టపర్తి సాయి బాబానే తనను దీవించి నామకరణం కూడా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. తాను కూబాబాకు గొప్ప భక్తురాలునని, ఆయన బోధనలు తనలో ధైర్యాన్ని నింపాయన్నారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి అలవాటు చేసుకున్నట్లు తెలిపారు.
ఇక సాయి పల్లవి నటిగా బిజీగా ఉన్నసంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇతిహాసం `రామాయణం` లో నటిస్తోంది. ఇప్పటికే ఓభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న`రామాయణం` రెండవ భాగం షూటింగ్ లో పాల్గొంది. ఈ సినిమా మొదలైన నాటి నుంచి సాయి పల్లవి ముంబైలోనే ఉంటుంది. తెలుగులో అవకాశాలు వచ్చినా కమిట్ అవ్వడం లేదు. బాలీవుడ్ లోనే `మేరే రాహో` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. వచ్చే ఏడాది `రామాయణం` మొదటి భాగంతో పాటు `మేరే రాహో` కూడా రిలీజ్ అవుతుంది.
`రామాయణం` రెండవ భాగం మాత్రం 2027 లో రిలీజ్ కానుంది. `తండేల్` విజయం తర్వాత సాయి పల్లవి మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. అలాగే తమిళ్ లో `అమరన్` తర్వాత మరో సినిమా చేయలేదు. `తండేల్`, `అమరన్` రెండు బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలే. రెండు భాషల్లోనూ చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అమ్మడు వాటికి నో చెప్పింది.