• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందుకే ఆమె 'క్వీన్ ఆఫ్...

అందుకే ఆమె 'క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్'..!

| 'అమరన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను టచ్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-11-13 03:50 GMT

నేచురల్ యాక్టింగ్ తో, అదిరిపోయే డ్యాన్స్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా, స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల ''అమరన్'' వంటి డబ్బింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో శివ కార్తీకేయన్‌ కు జోడీగా నటించింది. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

'అమరన్' మూవీలో సాయి పల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో, ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో ఆమె నటించింది. నటించింది అనడం కంటే జీవించింది అనడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే అంత అద్భుతంగా ఆమె తన పాత్రను పోషించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె యాక్టింగ్ ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.

'అమరన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను టచ్ చేసింది. తమిళంలోనే కాదు, తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబడుతోంది. దీనికి కారణం సాయి పల్లవి అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో దీన్ని సాయి పల్లవి సినిమాగానే చూస్తున్నారు. మన దగ్గర ఈ రేంజ్ లో ఈ సినిమా ఆడటానికి ఆమెనే మెయిన్ రీజన్ అని చెప్పాలి.

నిజానికి 'అమరన్' విడుదలకు ముందు సోషల్ మీడియాలో సాయి పల్లవిపై గట్టిగా నెగెటివ్ క్యాంపెయిన్ నడిచింది. కొందరు కావాలని ఓ పాత వీడియోని తీసుకొచ్చి, ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమె నటించే చిత్రాలను బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కు ఏమైనా అడ్డంకులు వస్తాయేమో? ఈ ఎఫెక్ట్ రిజల్ట్ మీద ప్రభావం చూపుతుందేమో? అని అందరూ ఆలోచించారు. కానీ పల్లవి పెర్ఫార్మెన్స్ ముందు ఏ కాంట్రవర్సీ నిలబడలేకపోయింది.

కాంట్రవర్సీలు మర్చిపోయి ఆడియన్స్ సాయి పల్లవిని అక్కున చేర్చుకున్నారు. ఏమీ పట్టించుకోకుండా 'అమరన్' చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఆమె నటనకు స్టాండింగ్ ఒవేషన్ కూడా అందుకుంది. రియల్ లైఫ్ క్యారక్టర్ లో అంతే అద్భుతంగా, సహజంగా నటించిందని అంతా కొనియాడుతున్నారు. ఇప్పుడు కేవలం ఆమె కోసం థియేటర్లకు వస్తోన్న ఆడియన్స్ ఉన్నారంటే, ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అవుతుంది. నిజంగా ఇలాంటి ప్రేమ, ఆదరణ చాలా తక్కువ మంది హీరోయిన్లకే దొరుకుతుంది.

'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమైన సాయిపల్లవి.. 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అప్పటి నుండే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా.. చాలా సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ వచ్చింది. నటనకు స్కోప్ ఉండే కంటెంట్-ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో వచ్చిన 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింఘ రాయ్' 'గార్గి' లాంటి విజయవంతమైన చిత్రాలు ఆమె స్క్రిప్ట్ జడ్జిమెంట్ ను ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాయి.

సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్.. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని పేర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య లాంటి హీరో ఆమెను కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గా అభివర్ణించారు. గ్లామర్ రోల్స్ చేయకుండా, కమర్షియల్ సినిమాలలో నటించకుండానే.. ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకోవడం, వరుస హిట్లు సాధించడం ఈ జనరేషన్ లో ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆమె కింగ్ ఆఫ్ బాక్సాఫీస్. అమరన్ తో మంచి హిట్టు కొట్టిన సాయి పల్లవి.. వచ్చే ఏడాది 'తండేల్' మూవీతో రానుంది. 'లవ్ స్టోరీ' తర్వత చైతూ - పల్లవి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఇది కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

Tags:    
  • Saipallavi 
  • Amaran 
  • Moviecollections 
  • Sivakarthikeyan 
  • Lovestory 
  • Shyamsingharoy 
  • Gargi 
  • Thandel 
  • Nagachaitanya 
  • Sukmar 
  • Premam 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS